వన్డే ప్రపంచకప్ 2023కు ఇండియా ఆతిధ్యం ఇవ్వనుంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీసీసీఐకు షాక్ ఇవ్వనున్నాయి. అసలు వన్డే ప్రపంచకప్ ఆతిధ్యమే తరలిపోవచ్చని తెలుస్తోంది. నిజమా..ఎందుకీ పరిస్థితి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 వన్డే ప్రపంచకప్‌ను బీసీసీఐ ఇండియాలో నిర్వహించనుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు తాజా పరిణామాలు బీసీసీఐకు షాక్ ఇస్తున్నాయి. పాకిస్తాన్ వర్సెస్ బీసీసీఐ వివాదం ఓ వైపు పన్నుల విషయంలో బీసీసీఐకు భారత ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రతిష్ఠంభన మరోవైపు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు వివాదాస్పద సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోవాలని ఐసీసీ..బీసీసీఐకు కఠినంగా సూచించింది. త్వరగా పరిష్కరించుకోకుంటే..2023 వన్డే ప్రపంచకప్ ఆతిథ్యాన్ని ఇండియా నుంచి తరలిపోయే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.


ఏంటీ వివాదం


2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఇండియా, శ్రీలంక దేశాలు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. కానీ ఇండియాతో బీసీసీఐ పన్ను వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. బీసీసీఐ వార్షిక ఆదాయం నుంచి 190 కోట్లను ఐసీసీ మినహాయించింది. వాస్తవానికి ఐసీసీ పన్నును 21.84 శాతానికి అంటే 116 మిలియన్లకు పెంచడం ఇదే తొలిసారి. భారత రూపాయిల ప్రకారం 900 కోట్లు అవుతుంది. బీసీసీఐకు భారత ప్రభుత్వానికి మధ్య ఉన్న పన్ను వివాదం త్వరగా పరిష్కరించకపోతే..2023 ఆతిధ్యం కాస్తా ఇండియా నుంచి లాక్కుని..వేరే దేశానికి కేటాయించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.


Also read: WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-2లోకి టీమిండియా.. ఫైనల్‌కు చేరే సమీకరణలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook