Sreesanth retirement from first class Cricket: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని.. ఇది తనకు సంతోషాన్ని ఇవ్వకపోయినా.. రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించినట్లు తెలిపాడు.ఈ మేరకు శ్రీశాంత్ ట్విట్టర్‌ ద్వారా తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించాడు.ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. బరువెక్కిన హృదయంతో ఈ మాటలు చెబుతున్నానని.. అయితే రిటైర్‌మెంట్ పట్ల తానేమీ విచారించట్లేదని పేర్కొన్నాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నాకు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు మద్దతుగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నా. ఇక ముందు యువ క్రికెటర్ల కోసం కోచింగ్ సెటప్‌లో భాగం కావాలనుకుంటున్నాను. వీలైతే బీసీసీఐ అనుమతినిచ్చాక ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్స్‌లో ఆడాలనుకుంటున్నా.' అని శ్రీశాంత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. 



2013 ఐపీఎల్ సీజన్‌లో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా శ్రీశాంత్‌ బీసీసీఐ నుంచి ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నిజానికి శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించగా.. సుప్రీం సూచన మేరకు శిక్షను తగ్గించారు. ఆ తర్వాత కేరళ రంజీ జట్టు తరుపున శ్రీశాంత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ జట్టు తరుపున సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ఆడాడు. గతేడాది కేరళ జట్టు తరుపున విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20ల్లో శ్రీశాంత్ ఆడాడు.


Also Read: KCR Jobs Announcement: ఏపీలోనూ కేసీఆర్‌కు క్రేజ్.. సీఎం చిత్ర పటానికి పాలాభిషేకాలు... 


Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషి పెరారివాలన్‌కు సుప్రీం బెయిల్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook