Shaheen Afridi In T20 Blast: పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది టీ20 బ్లాస్ట్ టోర్నీలో తన బౌలింగ్ తో నిప్పులు చెరిగాడు. నాటింగ్‌హ‌మ్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా.. ఇంగ్లాండ్​ వేదికగా శుక్రవారం నాటింగ్‌హ‌మ్‌షైర్‌, వార్విక్‌షైర్ మ‌ధ్య  మ్యాచ్ జరిగింది. మెుదట బ్యాటింగ్ చేసిన నాటింగ్‌హ‌మ్‌షైర్ 20 ఓవ‌ర్ల‌లో 168 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టామ్ మూర్ 73 ప‌రుగుల‌ు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. జేమ్స్ 37, క్లార్క్ 26 ప‌రుగుల‌తో రాణించారు. అయితే ఈ ముగ్గురు మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. 


Also Read: ODI World Cup 2023: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. చుక్కలు చూపిస్తున్న హోటల్ రూమ్స్ ధరలు..


అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వార్విక్‌షైర్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు అఫ్రిది. ఇన్నింగ్స్ తొలి బంతిని వైడ్ గా వేశాడు షాహిన్. దానిని కీపర్ అందుకోకపోవడంతో అది బౌండరీకి వెళ్లింది. దీంతో మెుదటి బంతికి ఐదు పరుగులు వచ్చినట్లయింది. ఆ తర్వాత రెండు బంతులకు అలెక్స్ డేవిస్‌, బెంజిమ‌న్‌ల‌ను షాహిన్ అఫ్రిది ఔట్ చేశాడు. మూడు, నాలుగు బంతులకు సింగిల్స్ ఇచ్చాడు షాహిన్. చివరి రెండు బాల్స్ కు మౌస్లీ, బెర్నార్డ్‌ల‌ను పెవిలియ‌న్‌ బాట పట్టించాడు. దీంతో ఫస్ట్ ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి టీ20ల్లో ఈ రికార్డు క్రియేట్ చేసిన బౌలర్ గా నిలిచాడు. అయితే షాహీన్ అదరగొట్టినా నాటింగ్‌హ‌మ్‌షైర్ ఓట‌మి పాలైంది. యేట్స్(65) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడి వార్విక్‌షైర్‌కు విజ‌యాన్ని అందించాడు.


Also Read: Indian cricket team: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11'.. బైజూస్ స్థానంలో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook