PAK Vs BAN Highlights: ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన పాక్.. సెమీస్ రేసు నుంచి బంగ్లా ఔట్
Pakistan vs Bangladesh Full Highlights: పాకిస్థాన్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. బంగ్లాదేశ్‌ను 7 వికెట్లతో ఓడించి.. వరుస నాలుగు ఓటములతో తరువాత గెలుపు రుచి చూసింది. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Pakistan vs Bangladesh Full Highlights: ఎట్టకేలకు ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గెలుపు బాట పట్టింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన పాక్.. మంగళవారం బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన పాకిస్థాన్.. తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. కోల్‌కతాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి.. 32.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ప్రపంచకప్‌లో పాక్‌కు ఇది మూడో గెలుపు. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందినా.. పాకిస్థాన్ సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ విజయంతో సెమీఫైనల్ ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకుంది. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా పాక్ భవితవ్యం తేలనుంది. అయితే వరుసగా ఓటముల తరువాత ఈ గెలుపు కాస్త రిలీఫ్‌గా చెప్పొచ్చు.
బంగ్లాదేశ్ విధించిన 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్ బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ ఓపెనింగ్ జంట తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించింది. మెహిదీ హసన్ మిరాజ్ (68)ను షఫీక్ ఎల్‌బీడబ్ల్యూ చేసి బంగ్లాకు తొలి వికెట్ అందించాడు. కెప్టెన్ బాబర్ (9), ఫఖర్ జమాన్‌ను (81) వికెట్లు కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. రిజ్వాన్ 26 పరుగులు, ఇఫ్తికార్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. మహ్మదుల్లా (70 బంతుల్లో 56, 6 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 43, 4 ఫోర్లు) మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ముకుమ్మడిగా విఫలయ్యారు. 45.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ చెరో మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. హరీస్ రౌఫ్‌కు రెండు వికెట్లు దక్కగా.. ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ తలో వికెట్ తీశారు. ఫఖర్ జమాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ గెలుపుతో పాక్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. 7 మ్యాచ్‌ల్లో మూడు విజయాల్లో 6 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు పాక్ ఆడాల్సి ఉంది. ఆ రెండు గెలిచినా.. టాప్-4లో ఉన్న జట్లు ఓడిపోతే పాక్‌కు సెమీస్ ఛాన్స్ ఉంటుంది. బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు 6 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా.. కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఓటమితో అధికారికంగా సెమీస్ రేసు నుంచి ఔట్ అయింది.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి