Pakistan Batter Khurram Manzoor Comparing Himself With Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల మెషిన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా.. క్రీజులో ఉన్నదంటే పరుగుల వరద పారాల్సిందే. తన అద్భుత ఆటతో కోహ్లీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అంతేకాదు మరెన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రస్తుత క్రికెటర్లలో కోహ్లీని మించి ఆటగాడు లేనే లేడు. అలాంటి ఆటగాడితో ఓ అనామక పోల్చుకున్నాడు. అంతేకాదు తానే ప్రపంచ నం.1 అని, తన తర్వాత బ్యాటింగ్ మాస్ట్రో కోహ్లీ ఉన్నాడని పేర్కొన్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. పాకిస్తాన్ ఔట్‌ డేటెడ్‌ బ్యాటర్‌ ఖుర్రం మంజూర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ క్రికెట్ చూసిన గొప్ప బ్యాటర్లు, కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అతని గణాంకాలు మరియు అభిమానుల ఫాలోయింగ్‌ కోహ్లీ ఏంటో యిట్టె చెప్పేస్తాయి. కోహ్లీ ఇప్పటికే 74 అంతర్జాతీయ సెంచరీలు బాదాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును సమం చేయడానికి 26 సెంచరీల దూరంలో ఉన్నాడు. కొన్నేళ్లుగా పాకిస్థాన్ మాజీలు తమ బ్యాటర్లు, కోహ్లీ మధ్య పోలికలు పెడుతున్నారు. బాబర్ ఆజమ్‌ను విరాట్‌తో పోల్చుతున్నారు. తాజాగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ కంటే తానే బెటర్ అని మరో పాక్ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ కంటే మెరుగైన లిస్ట్-ఎ రికార్డు తనదే అని పాకిస్థాన్ బ్యాటర్ ఖుర్రం మంజూర్ పేర్కొన్నాడు. నాదిర్ అలీకి చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మేరకు బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 'నేను విరాట్ కోహ్లీతో నన్ను పోల్చుకోవడం లేదు. వాస్తవం ఏమిటంటే.. 50 ఓవర్ల క్రికెట్‌లో టాప్ 10లో ఎవరు ఉన్నా నేనే ప్రపంచ నం.1. నా తర్వాతనే కోహ్లీ నిలిచాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో నా కన్వర్షన్ రేట్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉంది. విరాట్ ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ చేస్తే.. నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌లో సెంచరీ చేస్తాను. గత 10 ఏళ్లుగా ఈ ఫార్మాట్‌లో నా సగటు 53. ప్రపంచ లిస్ట్‌-ఏ క్రికెట్‌ గణాంకాల్లో నేను ఐదో స్థానంలో ఉన్నా' అని మంజూర్ అన్నాడు. 


పాకిస్థాన్ వెటరన్ బ్యాటర్ ఖుర్రం మంజూర్.. లిస్ట్-ఏ క్రికెట్‌లో 166 మ్యాచ్‌ల్లో 7992 పరుగులు చేశాడట. 53 సగటుతో 27 శతకాలు చేశాడని తెలుస్తోంది. ఇక 2008లో పాకిస్తాన్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఖుర్రం.. 16 టెస్ట్‌లు, 7 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా పాక్‌ జట్టుకు టీ20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వచించాడు. అప్పటినుంచి మళ్లీ పాక్ జట్టులోకి రాలేదు. ఖుర్రం టెస్ట్‌ల్లో సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీలు.. వన్డేల్లో 3 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఖుర్రం మంజూర్-విరాట్ కొహ్లీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో కోహ్లీనే అతడిని రనౌట్‌ చేశాడు. 


Also Read: Shubman Gill Century: భవిష్యత్తు 'సూపర్ స్టార్‌' శుభ్‌మన్‌ గిల్‌.. క్రికెట్‌ను శాసిస్తాడు: సల్మాన్   


Also Read: Republic Day 2023: రాజభవన్‌లో గణతంత్ర వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై! హాజరు కాని ప్రభుత్వ పెద్దలు   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.