IND vs NZ, Salman Butt Says Shubman Gill is a Future Cricket Superstar: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. భవిష్యత్తు సూపర్ స్టార్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. గిల్ పరుగుల దాహంతో ఉన్నాడని, కేవలం ఒక్క భారీ స్కోర్‌తో అతడు సంతృప్తి చెందలేదన్నాడు. ఇంత చిన్న వయసులో గిల్ చూపించిన బ్యాటింగ్ అద్బుతమని సల్మాన్ భట్ ప్రశంసించాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ 360 పరుగులు చేశాడు. మొదటి వన్డేలో డబుల్ సెంచరీ (208; 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన గిల్.. మూడో వన్డేలో శతకం (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు సూపర్ స్టార్. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో డబుల్ సెంచరీ బాది.. మూడో వన్డేలోనూ సెంచరీ చేశాడు. కేవలం ఒక్క భారీ స్కోర్‌తో గిల్ సంతృప్తి చెందలేదు. భారత యువ ఓపెనర్ పరుగుల దాహంతో ఉన్నాడని చెప్పటానికి ఈ సిరీస్ ఓ నిదర్శనం. గిల్ వయసు 23 ఏళ్లే. ఇంత చిన్న వయసులో అతడు చూపించిన బ్యాటింగ్ అద్బుతం. చాలా బాగా ఆడుతున్నాడు' అని అన్నాడు.
'శుభ్‌మన్ గిల్ మంచి ప్రతిభ గల ఆటగాడు కానీ 30, 40 పరుగులు చేసి వెనుదిరుగుతున్నాడు అని గతంలో భావించే వాళ్లం. కానీ ఇప్పుడు మా అభిప్రాయాన్ని మార్చేశాడు. నిలకడగా రాణిస్తూ భారీ స్కోర్ చేస్తున్నాడు. భారత టాప్ ఆర్డర్‌కు అండగా నిలుస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత భారతదేశం యొక్క టాప్ ఆర్డర్‌పై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. గిల్ కచ్చితంగా క్రికెట్‌ను శాసిస్తాడని నేను అబిప్రాయపడుతున్నాను' పాకిస్థాన్ మాజీ కెప్టెన్ చెప్పాడు. ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.
Also Read: Surya Guru Yuti 2023: 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో సూర్యుడు, గురు.. ఈ 3 రాశుల వారికి పండగే పో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.