Pak vs SA: 49 పరుగుల తేడాతో పాక్ గెలుపు
పాక్ vs సౌతాఫ్రికా: 49 పరుగుల తేడాతో పాక్ గెలుపు
లండన్: ఐసిసి ప్రపంచ కప్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్స్ మైదానంలో సౌతాఫ్రికాతో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం 309 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 259 పరుగులకే చాటచుట్టేసింది. దీంతో 49 పరుగుల తేడాతో విజయం పాక్ వశమైంది.