భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చూసి పాకిస్థాన్ జట్టు కెప్టేన్ సర్ఫరాజ్ అహ్మద్ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు... పాక్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్. అవును, ప్రస్తుతం ఫామ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహమ్మద్ యూసుఫ్.. ఆ విషయంలో ధోనీ వద్ద సలహాలు తీసుకోవాలని మహమ్మద్ యూసుఫ్ సూచించారు. మూడు ఫార్మాట్లని విజయవంతంగా ముందుండి నడిపించిన ధోనీ తాను కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గాను అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. అత్యధిక కాలంపాటు కెప్టెన్‌గా కొనసాగాడు. అందుకే సర్ఫరాజ్, ధోనీని అడిగి ఫిట్‌నెస్ సలహాలు తీసుకోవాల్సిందిగా సూచించాడు మహమ్మద్ యూసుఫ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధోనికి ఫోన్ చేసి సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు. అతడు కచ్చితంగా మంచి సలహా ఇస్తాడు. ఎందుకంటే వికెట్ కీపర్‌గా వుంటూ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు అని అభిప్రాయపడ్డాడు యూసుఫ్.


గతేడాది ఇంగ్లాడ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను ముందుండి నడిపించిన తర్వాత మూడు ఫార్మాట్లలోనూ పాక్ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకున్న సర్ఫరాజ్ అహ్మద్... న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్‌ని న్యూజీలాండ్ జట్టు వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్ఫరాజ్‌పై మరింత ఒత్తిడిని పెంచిందనే అనుకోవచ్చు.