CoronaVirus కలకలం.. ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో ముగ్గుకు క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏ లక్షణాలు కనిపించడం లేదని, అయితే ప్రస్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
పాకిస్తాన్ (Pakistan)కు ఇంటా బయట కలిసిరావడం లేదు. పాక్ క్రికెట్ జట్టును ప్రస్తుతం కరోనా మహమ్మారి వెంటాడుతోంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు T20లు ఆడేందుకు జూన్ 28న మాంచెస్టర్ బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా సోకింది. ఒక్కసారిగా ముగ్గురు ఆటగాళ్లు కోవిడ్19 బారిన పడటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ(PCB) ఉక్కిరిబిక్కిరవుతోంది. YSRCP ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. వారిలో తొలి కేసు
పాకిస్తాన్ క్రికెటర్లు షాదాబ్ ఖాన్(Shadab Khan), హ్యారిస్ రవూఫ్(Haris Rauf), హైదర్ అలీ(Haider Ali)కి సోమవారం జరిపిన టెస్టుల్లో (Pak Crickters Tests CoronaVirus Positive) పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆటగాళ్లందరికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, కానీ ఇంగ్లాండ్ పర్యటన (Pakistan Tour of England)కు వెళ్లే ముందు ఆదివారం రావల్పిండిలో కరోనా టెస్టులు చేశారు. ఈ ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్‌గా తేలిందని, వారంతా ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొంది. గంగూలీ ఫ్యామిలీలో కరోనా అలజడి
కాగా, ఇంగ్లాండ్ పర్యటనకు వీరి స్థానంలో మరో ముగ్గురు క్రికెటర్ల ఎంపికపై పీసీబీ (pcb) ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి కరోనా సోకింది. ఈ సమాచారాన్ని ఆఫ్రిది స్వయంగా తెలిపాడు. తన ఆరోగ్యం మెరుగైందని సైతం ఆఫ్రిది తాజాగా వెల్లడించాడు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ