గంగూలీ ఫ్యామిలీలో కరోనా అలజడి.. మొత్తం నలుగురికి COVID19 పాజిటివ్

ఓవైపు ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని, లీగ్ కోసం గంగూలీ (Sourav Ganguly) కసరత్తులు చేస్తుంటే మరోవైపు ఆయన కుటుంబసభ్యులు కరోనా సమస్యలో చిక్కుకున్నారు. గంగూలీ సోదరుడిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

Last Updated : Jun 20, 2020, 04:18 PM IST
గంగూలీ ఫ్యామిలీలో కరోనా అలజడి.. మొత్తం నలుగురికి COVID19 పాజిటివ్

 కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav ganguly) కుటుంబంలో కలకలం రేపుతోంది. గంగూలీ అన్న, రంజీ మాజీ క్రికెటర్ అయిన స్నేహశీష్ భార్యకు శనివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గంగూలీ, స్నేహశీష్ కుటుంబసభ్యులు కరోనా టెస్టులు చేపించుకున్నారు. గంగూలీ సోదరుడు స్నేహశీష్‌కు రిపోర్టులో కోవిడ్19 నెగటివ్‌గా వచ్చింది. స్నేహశీష్ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వలయాకార సూర్యగ్రహణం.. రేపు ఖగోళంలో అద్భుతం

గంగూలీ వదినతో పాటు ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వీరితో పాటు ఇంట్లో ఓ పని మనిషికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నలుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గంగూలీ సోదరుడు స్నేహశీష్‌ను సైతం మోమిన్‌పూర్‌లోని నివాసంలో హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు.  IPL‌కు సిద్ధంగా ఉండాలి: సౌరవ్ గంగూలీ

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నిర్వహణకు సంబంధించిన పనులతో గంగూలీ బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ నిర్వహణ, టీ20 వరల్డ్ కప్‌లలో ఏది జరుగుతుందో అర్ధంకాని పరిస్థితుల్లో తలమునకలై ఉన్నాడు. ఏది ఏమైనా సరే ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించి తీరాలని గంగూలీ భావిస్తున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News