Pakistan Cricketers Played For India : ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల ప్రజలకే కాదు.. యావత్ ప్రపంచానికి అది ఒక హైలీ టెన్షన్ మ్యాచ్. ఈ దేశం.. ఆ దేశం అని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు అందరూ టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఉంటుంది. ఈ రెండు దేశాలు ఫ్రెండ్లీగా సిరీస్‌లు ఆడే రోజులు ఎప్పుడో పోయాయి కానీ.. వరల్డ్ కప్ టోర్నీలలో లేదా ఆసియా కప్ టోర్నీలలో ఒకరికొకరు తలపడే సందర్భం వచ్చినప్పుడే క్రికెట్ ప్రియులకు ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ చూసే అవకాశం వస్తుంది. ఇండియా vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఉందంటే.. కొన్ని వారాల ముందు నుంచే ఆ మ్యాచ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం అవుతుంది. రెండు దేశాల ఆటగాళ్లు బ్యాట్, బాల్ పట్టుకుని కొట్టుకుంటారా అన్నంత సస్పెన్స్ ఉంటుంది. ఎంటర్‌టైన్మెంట్ భాషలో చెప్పాలంటే.. అదొక బ్లాక్ బస్టర్ మ్యాచ్.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు మనం చెప్పుకున్నది అంతా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అలాంటిది ఇప్పుడు మేం మీకు చెప్పబోయే విషయం వింటే షాక్ అవుతారు. ఇండియా , పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఇండియా తరుపున ఆడారు అంటే నమ్ముతారా ? ఔను, ఒక ముగ్గురు ఆటగాళ్లకు ఆ అవకాశం దక్కింది. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇండియా, పాకిస్థాన్ .. రెండు దేశాల జట్లకు ప్రాతినిథ్యం వహించారు. అందులో ఒకరు పాకిస్థాన్ జట్టు ఫస్ట్ కేప్టేన్ కూడా ఉన్నాడు. 


ఇంతకీ ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అనేది ఇఫ్పుడు చూద్దాం. ఈ జాబితాలో ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఆటగాడి పేరు అబ్ధుల్ హఫీజ్ కర్దార్. 1947 లో ఇండియా , పాకిస్థాన్ దేశాలు విడిపోక ముందు అబ్ధుల్ హఫీజ్ కర్దార్ ఇండియా తరపున 3 టెస్ట్ మ్యాచులు క్రికెట్ ఆడాడు. ఆ తరువాత పాకిస్థాన్ వెళ్లిపోయాడు. అక్కడ 26 టెస్ట్ మ్యాచులు ఆడాడు. పైగా ఫస్ట్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫస్ట్ కేప్టేన్ కూడా అతడే. అందుకే పాకిస్థాన్ అతడిని తమ దేశానికి ఫాదర్ ఆఫ్ క్రికెట్ అని ( ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ ) పిలుచుకుంటుంది.  


గుల్ మొహమ్మద్ ఈ జాబితాలో రెండో ఆటగాడు. ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన ముగ్గురు ఆటగాళ్లలో గుల్ మొహమ్మద్ రెండో క్రికెటర్. ఇండియా తరపున 8 ఇంటర్నేషన్ క్రికెట్ మ్యాచులు ఆడిన తరువాత 1952 గుల్ మొహమ్మద్ పాకిస్థాన్ వెళ్లిపోయాడు. కానీ పాకిస్థాన్ వెళ్లిన గుల్ మొహమ్మద్‌కి అక్కడ కాలం కలిసి రాలేదు. పాక్ తరపున కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన తరువాత ఫామ్ కోల్పోయిన కారణంగా గుల్ మొహమ్మద్ క్రికెట్ కెరీర్ ముగిసింది.


ఇది కూడా చదవండి : Yashasvi Jaiswal Debut : ఒకప్పుడు పానీ పూరీ అమ్మిన కుర్రాడు.. ఇవాళ టీమిండియాలోకి అరంగేట్రం


ఈ జాబితాలోకి వచ్చే మూడో ఆటగాడు ఆమీర్ ఇలాహి. ఇండియా, పాకిస్థాన్ విభజన వల్ల రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న మూడో ఆటగాడు ఆమీర్ ఇలాహి. రెండు దేశాలు విడిపోవడానికి ముందు ఆమీర్ ఇండియాకు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత పాకిస్థాన్ వెళ్లిన ఆమీర్.. అక్కడ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు.


ఇది కూడా చదవండి : World Cup 22023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మారింది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి