రాజకీయ వైరం కాస్త ఇప్పుడు క్రీడారంగం వైపు మళ్లింది. భారత్ తో వైరం కొని తెచ్చుకున్న పాక్ ..ఇప్పుడు ఆ వైరాన్ని క్రీడా రంగంపై కూడా బలవంతంగా రుద్దుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రసారాలు నిషేదించాలని పాక్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్  ప్రసార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌధురీ ప్రకటన చేశారు.  ఐపీఎల్ విషయంలో కూడా తమ వైఖరి ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు


పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్) ను భారత్ లో ప్రసారం కాకుండా నిషేధం విధించగా.. ఇప్పుడు పాక్ అందుకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ను పాకిస్థాన్ లో ప్రసారం కాకుండా నిషేధం విధించారు. ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేయడం వల్ల భారత్ కు ఎలాంటి నష్టం ఉండబోదని..ఇది పాకిస్తాన్ కే ఎక్కువ నష్టం ఉందని  విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు