Pakistani Former Cricketer Danish Kaneria on CAA: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఏఏను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంట్ 2019లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనాప్పటికీ ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకు మేలు జరగనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తన మద్దతు ప్రకటించాడు కనేరియా. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక నుంచి పాకిస్తానీ హిందువులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌లో సింధ్‌కు చెందిన కనేరియా.. ఆ దేశంలో రెండో హిందూ క్రికెటర్. కనేరియా పాక్ తరపున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో అతడు 261 వికెట్లు తీశాడు. 


2019లో కేంద్రం తెచ్చిన సీఏఏ చట్టంపై అప్పట్లో దేశవ్యాప్తంగా విమర్శలు తలెత్తాయి. అప్పట్లో కూడా భారత్ నిర్ణయానికి మద్దతు పలికాడు కనేరియా. పార్లమెంట్ ఆమోదించి చాలా కాలమే అయినా.. ఎన్నికలకు ముందు సీఏఏను అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారందరూ భారత పౌరసత్వానికి అర్హత సాధిస్తారు.  


Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ కు టీ20కా బాప్ దూరం..!


Also Read: Yashasvi Jaiswal: స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న టీమిండియా కుర్ర హిట్టర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter