IND vs SA: టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికాడు..అర్ష్‌దీప్‌పై పాక్ మాజీ ప్లేయర్ ప్రశంసలు..!
IND vs SA: దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భారత బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా యువ పేసర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
IND vs SA: టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అతడు బులెట్ల లాంటి బంతులను సంధిస్తున్నాడు. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. అర్ష్‌దీప్‌ను మాజీ పేసర్ జహీర్ ఖాన్‌తో పోల్చాడు. అతడు అద్భుతమైన బౌలర్ అని..పేస్, స్వింగ్ రెండింటినీ రాబట్టగలడని చెప్పాడు.
తన సామర్థ్యం గురించి అంచనా వేస్తాడని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్టు అస్త్రాలు సంధించగలడని అభిప్రాయపడ్డాడు. అందుకే భారత జట్టుకు జహీర్ ఖాన్ లాంటి వ్యక్తి దొరికాడన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇదే కనిపించిందన్నాడు కమ్రాన్ అక్మల్. సౌతాఫ్రికా కీలక ప్లేయర్లు డికాక్, రొస్సొసౌ, మిల్లర్‌లకు ఔట్ చేశాడని గుర్తు చేశాడు. ఇందులో డేవిడ్ మిల్లర్ వికెట్ అత్యంత ప్రత్యేకమన్నాడు.
అతడిని షార్ప్ ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడన్నాడు అక్మల్. ఎంతో అనుభవం కలిగిన పేసర్‌గా బంతులు సంధించడాన్ని చెప్పాడు. ఇలాంటి బౌలర్ దొరకడం భారత జట్టుకు కలిసి వస్తుందన్నాడు. జహీర్‌ఖార్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టీమిండియాకు అవసరమని స్పష్టం చేశాడు. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో అతడి సేవలు పనికి వస్తాయన్నాడు. ఆసియా కప్‌లో అతడు విశేషంగా రాణించాడు.
వికెట్లు తీయలేకపోయిన డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు అతడికి విశ్రాంతి ఇచ్చారు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ పునరాగమనం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అర్ష్‌దీప్ 12 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.44గా ఉంది. 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఉంది.
[[{"fid":"247103","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:GST Collections: దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!
Also read:TDP Twitter: మరోమారు టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్..చంద్రబాబు సీరియస్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి