Pakistan Journey in T20 World Cup: అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నీ ఆరంభంలోనే వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్ని అన్ని వైపులా నుంచి విమర్శలు ఎదుర్కొన్న పాక్.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకుంది. పాక్‌ కష్టానికి అదృష్టం కూడా తోడు కావడంతో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. అనుకోకుండా వచ్చిన ఛాన్స్‌ను పాక్ రెండు చేతులా ఒడిసి పట్టుకుంది. సెమీస్‌లో పటిష్ట న్యూజిలాండ్‌ను సునాయసంగా మట్టికరిపించి.. విమర్శల నోళ్లు మూయించింది. తమను తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. విరాట్ కోహ్లి అద్భుతం ఇన్నింగ్స్‌ ఆడడంతో పాక్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరువాత జింబాబ్వే చేతిలో ఓటమి ఆ జట్టును బాగా కుంగదీసింది. విజయం ధీమాతో ఉన్న పాక్.. చివరికి ఒక పరుగు తేడాతో పరాజయం చవిచూసింది. రెండు మ్యాచ్‌లో వరుసగా ఓడిపోవడంతో ఇక పాకిస్థాన్ పని అయిపోయిందనుకున్నారు. సెమీస్‌కు చేరడం కష్టమే అనుకున్నారు. 


ఎవరు ఏమనుకున్నా పాకిస్థాన్ టీమ్ మాత్రం నమ్మకం కోల్పోలేదు. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి తీరాల్సిన సమయంలో దృఢ సంకల్పంతో బరిలోకి దిగింది. ముందు నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఆ తరువాత భారత్‌ను ఓడించిన దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. అయినా పాక్ సెమీస్ చేరేందుకు అవకాశం దక్కలేదు. దక్షిణాఫ్రికా జట్టు కచ్చితంగా ఒక మ్యాచ్‌లో ఓడిపోతేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలోనే నెదర్లాండ్స్ టీమ్ పాకిస్థాన్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. సఫారీ జట్టును చిత్తు చేసి పాక్‌కు సెమీ ఫైనల్ మార్గం సుగమం చేసింది. ఇక చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.


ఇలా అనుకోకుండా తమకు సెమీస్‌ అవకాశం దక్కడంతో పాక్ జట్టులో కసి మరింత పెరిగిపోయింది. ఇక ఈ ఛాన్స్‌ను ఏ మాత్రం వదులుకోకుడదనే ఉద్దేశంతో కివీస్‌తో మ్యాచ్‌కు అన్ని విధాలుగా సిద్ధమై గ్రౌండ్‌లోకి దిగింది. మొదట బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ కేవలం 152 పరుగులకే పరిమితం చేసింది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ స్కోరు ఛేదించాలంటే అంత ఈజీ కాదు. 


ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ బాబర్ అజామ్ తొలిసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఓపెనర్ రిజ్వాన్‌తో కలిసి కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. ఇద్దరు తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలోనే 105 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఇక మిగిలిన పనిని ఇతర బ్యాట్స్‌మెను చూసుకుని జట్టును ఫైనల్‌కు చేర్చారు. రేపు ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టుతో పాక్ కప్‌ కోసం పోటీ పడనుంది. 


Also Read: Pakistan: చెలరేగిన బాబర్ అజామ్ సేన.. కివీస్ చిత్తు.. ఫైనల్లోకి పాక్ ఎంట్రీ  


Also Read: ఎట్టకేలకు రాజా సింగ్ కు విడుదల.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook