Pakistan Semi Final Chances: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీస్‌ రేస్ నుంచి ఔట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు ఓటములు తరువాత పాక్ సెమీస్ భవితవ్యం ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్‌పై జింబాబ్వే అనూహ్యంగా విజయం సాధించడంతో గ్రూప్-బీ సెమీస్ ఫైట్ ఆసక్తికరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, జింబాబ్వేలపై పరాజయం పాలైన పాకిస్థాన్ ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల్లో పాయింట్లు లేకుండా ఐదో స్థానంలో ఉంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలు పాక్ కంటే ముందున్నాయి. భారత్‌కు రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో నాలుగు పాయింట్లు ఉండగా.. జింబాబ్వే, దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల్లో మూడు పాయింట్లు సాధించాయి. బంగ్లాదేశ్‌కు రెండు పాయింట్లు ఉన్నాయి.


ఇలా జరిగితేనే..


పాక్ సెమీ ఫైనల్ బెర్త్ ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంది.ఈ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాక్ తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో తప్పకుండా మంచి నెట్ రన్‌రేట్‌తో గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్ అవుతుంది. 


తరువాత జరగబోయే ఇతర జట్ల మ్యాచ్‌లు పాకిస్థాన్‌కు కీలకంగా మారనున్నాయి. జింబాబ్వేను బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాను ఇండియా ఓడించడంతో పాటు నెదర్లాండ్స్‌పై పాక్ గెలుపొందాలి. అప్పుడు భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లు, సౌతాఫ్రికా, జింబాబ్వే మూడు, పాకిస్థాన్ రెండు పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తాయి.


నవంబర్ 2న జింబాబ్వేను నెదర్లాండ్స్  ఓడించడంతోపాటు బంగ్లాదేశ్‌పై భారత్ గెలవాలి. తరువాత నవంబర్ 3న సిడ్నీలో సౌతాఫ్రికాను పాక్ చిత్తుచేయాలి. ఇలా జరిగితే..  భారత్‌కు ఎనిమిది పాయింట్లు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెరో నాలుగు, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు చెరో మూడు పాయింట్లు ఉంటాయి.


నవంబర్ 6న బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ ఓడించాలి. జింబాబ్వేపై టీమిండియా విజయం సాధించాలి. ఇలా జరిగితే భారత్ 10 పాయింట్లు, పాక్ 6 పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటాయి. ఆ తరువాత నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలిచినా ఆ జట్టుకు 5 పాయింట్లే ఉంటాయి.


కానీ దక్షిణాఫ్రికా ఆదివారం భారత్‌ను ఓడిస్తే.. పాక్‌కు సెమీస్‌ రేస్ ఇంకా సంక్లిష్టంగా మారుతుంది. అప్పుడు ఐదు పాయింట్లతో సౌతాఫ్రికా, భారత్ నాలుగు పాయింట్లతో నిలుస్తాయి. నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలుపొందే అవకాశం ఉంది. ఆ తరువాత జింబాబ్వే, బంగ్లాదేశ్‌లను భారత్ ఓడించే అవకాశం ఉండడంతో పాక్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయం. ఆదివారం సాయంత్రానికి పాకిస్థాన్‌ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత్ విజయ పరంపరను కొనసాగించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. 


Also Read: TRS MLAs Trap Case: టీఆర్ఎస్‌ మౌనం.. బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!  


Also Read: Pablo Mari Injured: సూపర్ మార్కెట్‌లో కత్తితో దాడి.. ఫుట్‌బాల్ ప్లేయర్‌కు గాయాలు.. ఒకరు మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook