Champions Trophy Host: 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్
Champions Trophy Host: ఐసీసీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్ వేదిక కానుంది. 2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది.
Champions Trophy Host: 2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (ICC Champions Trophy 2025) పాకిస్తాన్ వేదిక కానుందని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC News) ప్రకటించింది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది. 2024 – 2031 మధ్య కాలంలో పురుషుల విభాగంలో రెండు ఐసీసీ వరల్డ్ కప్ లు, నాలుగు టీ20 ప్రపంచకప్ లతో పాటు రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్స్ ను నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది.
ఈ ఈవెంట్లకు అమెరికాతో పాటు నమీబియా మొదటిసారి వరల్డ్ కప్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఐసీసీ టోర్నీలు | వేదికలు |
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2024) | యూఎస్ఏ, వెస్టిండీస్ |
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025) | పాకిస్తాన్ |
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2026) | ఇండియా, శ్రీలంక |
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (2027) | సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా |
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2028) | ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ |
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2029) | ఇండియా |
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2030) | ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ |
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (2031) | ఇండియా, బంగ్లాదేశ్ |
Also Read: Shoaib Akhtar: 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ వార్నర్‌కు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు'
Also Read: Candice Warner Twitter: ‘వార్నర్ ఫామ్ లో లేడా?’.. ఐపీఎల్ ఫ్రాంఛైజీపై వార్నర్ భార్య ఫైర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook