అత్యంత సోమరి కెప్టెన్ గా పాక్ సారధి సర్ఫరాజ్ !!
ముంబై: ప్రపంచ క్రికెట్ లో అత్యంత సోమరి కెప్టెన్ గా పాక్ సారధి సర్ఫరాజ్ అహ్మద్ గుర్తింపు సాధించారు. వాస్తవానికి ఇది ఐసీసీ ఇచ్చిన బిరుదు అనుకుంటే పొరబడినట్లే..భారత్ పై రెండు మ్యాచ్ లు వరుసగా ఓడిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్న పాక్ అభిమానులు సర్ఫరాజ్ ఈ అరుదైన బిరుదు ఇచ్చారు. ఇదే సమయంలో జట్టు పేలవ ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్ సమయంలో సర్ఫరాజ్ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్న భారత్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనేది చాలా చెత్త నిర్ణయమని అభిమానులు ఫైర్ అవుతున్నారు. పాక్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు మ్యాచ్ లోనూ టీమిండియాపై పాక్ ఘోరమైన ఓటమి చవిచూసింది..దీంతో పాక్ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇలా విరుచుకుపడుతున్నారు.
టీమిండియా ప్రదర్శన పై పాక్ మాజీ కెప్టెన్ ప్రసంశలు
మరోవైపు పాక్ పై చిరస్మరణీయమైన విజయం సాధించిన టీమిండియా జట్టుపై పాక్ క్రికటర్లతో సహా ఆ దేశ అభిమానులు ప్రసంశిస్తున్నారు. టీమిండియా ప్రదర్శనపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం స్పందిస్తూ ‘రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నాడు... జట్టును ముందుండి నడిపిస్తున్నాడు... అలాగే ధావన్ కూడా కెప్టెన్ తో సమానంగా రాణిస్తున్నాడు. వీరిద్దరూ క్రీజులోకి వచ్చారంటే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారని...ఆసీయకప్ లో టీమిండియా గొప్పగా రాణిస్తోందంటూ ప్రసంశించాడు.