Rohit Sharma Wife: కన్నీరుపెట్టుకున్న రోహిత్ శర్మ సతీమణి.. ఓదార్చిన అశ్విన్ భార్య!
RR vs MI, R Ashwin wife consoling Rohit Sharma wife Ritika. మైదానంలో మ్యాచ్ చూస్తోన్న రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్.. రితిక సజ్దేను ఓదార్చారు.
R Ashwin wife Prithi consoling Ritika Sajdeh after Rohit Sharma out: ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టిన విషయం తెలిసిందే. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన రోహిత్ సేన శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి కాస్త నిరాశకు గురయ్యారు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియ న్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మూడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ (2) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్.. మిఛెల్ మార్ష్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. రోహిత్ రెండు పరుగులకే పెవిలియన్ చేరడంతో అతని సతీమణి రితిక సజ్దే నిరాశ చెందారు. అప్పటివరకు ఎంతో హుషారుగా ఉన్న రితిక.. ఒక్కసారిగా ఏడుపుముఖం పెట్టేశారు.
మైదానంలో మ్యాచ్ చూస్తోన్న రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్.. రితిక సజ్దేను ఓదార్చారు. రితిక ఉన్న సీటు వద్దకు వచ్చి ఆమెను ప్రీతి గట్టిగా హత్తుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక చివరి ఓవర్లో ముంబై మ్యాచ్ గెలిచాక రితిక మొహం వెలిగిపోయింది. కుమార్తె సమైరాతో కలిసి సంబరాలు చేసుకున్నారు. గట్టిగా కేకలు కూడా వేశారు. అంతేకాదు తోటి ప్లేయర్ల కుటుంబ సభ్యులకు హగ్ ఇస్తూ సంతోషపడ్డారు. మొత్తానికి ఈ సీజన్లో ముంబై అందుకున్న మొదటి విజయానికి రితిక సంబరపడిపోయారు.
Also Read: Samantha Love: ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత.. మరోసారి లవ్‌లో..!
Also Read: SVP Trailer Leak: మహేష్ బాబుకు షాక్... సర్కారు వారి పాట ట్రైలర్ లీక్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook