ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా మోడీ ఆ దేశ ప్రధాని థెరెసా మే తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం గురించి చర్చించారు. భారత్-బ్రిటన్ దేశాల సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సి చర్యలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా లిక్కర్ డాన్ మాల్యా అంశాన్ని ప్రస్తావించి అతన్ని భారత్ కు అప్పగించాలని మరోమారు బ్రిటన్ ప్రధానికి మోడీ విజ్ఞప్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ మాల్యా వేల కోట్ల రుణాలు ఎగవేసి భారత్ నుంచి పరారై బ్రిటన్ లో తలదాచుకున్న విషయం తెలిసిందే. అతన్ని భారత్ కు రప్పించాలని పలు మార్లు మోడీ సర్కార్ ప్రయత్నాలు చేసింది. భారత్ అభ్యర్థన మేరకు ఆయన్ను బ్రిటన్ పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసినప్పటికీ ఆయనకు బ్రిటన్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. మాల్యా అంశంపై ప్రస్తుతం అక్కడ విచారణ కొనసాగుతుంది. చట్టాలను సవరించైనా సరే మాల్యాను అప్పగించాలని ఈ సందర్భంగా మోడీ బ్రిటన్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు మోడీ ప్రయత్నించారు. మాల్యాను భారత్ ను రప్పించేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమౌతాయనేది చర్చనీయంశంగా మారింది