అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
ఇటీవల ఐపీఎల్‌లో బెంగుళూరు ఫ్రాంఛైజీ తరపున ఆడి, అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన అఫ్ఘనిస్తాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా, అఫ్ఘాన్ జట్లను అభినందిస్తూ.. ప్రపంచ క్రికెట్‌కు రషీద్ ఒక అరుదైన సంపదగా మోదీ అభివర్ణించారు. నేటి ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో అఫ్ఘనిస్తాన్‌తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ.. ఇటీవల ఆ దేశ క్రికెట్ జట్టు భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అఫ్ఘనిస్తాన్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ భారత్‌తో ఆడటం అనేది ఇరు దేశాలకు ఓ గర్వించదగిన అంశం. రెండు జట్లు కూడా సమధీటుగా ఆడి క్రీడా స్పూర్తిని చాటుకున్నాయి అని చెబుతూ గత ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ మంచి ప్రతిభ కనబర్చారంటూ అభినందించారు.
ఈ సందర్భంగా రషీద్ ఖాన్ ప్రతిభను అభినందిస్తూ అప్పుడు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని చేసిన ట్వీట్‌ను సైతం మోదీ తన 'మన్ కి బాత్'లో ప్రస్తావించారు. రషీద్ ఖాన్‌ని అభినందిస్తూనే, తమ దేశానికి చెందిన యువ ఆటగాళ్లకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నందుకు అష్రఫ్ భారత్‌కి కృతజ్ఞతలు చెప్పడాన్ని ఇక్కడ మోదీ గుర్తుచేసుకున్నారు.