Cristiano Ronaldo tests positive for coronavirus: లిస్బన్: యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో ఫుట్‌బాల్ ప్రేమికులకు మరోసారి నిరాశ ఎదురైంది. పోర్చుగల్ కెప్టెన్, సాకర్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో  (Cristiano Ronaldo) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం UEFA నేషనల్స్ లీగ్‌ ఆడుతున్న రొనాల్డోకు కరోనావైరస్ (Coronavirus) పాజిటివ్‌‌గా తేలడంతో.. వెంటనే ఆయన జట్టును వీడి హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. దీంతో.. ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ జువెంటస్‌కు చెందిన 35 ఏళ్ల స్టార్ స్ట్రైకర్ రొనాల్డో నేషనల్ ఛాంపియన్స్ లీగ్‌ (UEFA Champions League) లో బుధవారం జరిగే.. స్వీడన్‌, పోర్చుగల్ మ్యాచ్‌లో ఆడడని పేర్కొంది. అయితే.. రొనాల్డోకు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కనిపించలేదని.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని, రెండు వారాలపాటు హోం క్వారంటైన్‌లో ఉంటాడని ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తెలిపింది. అయితే ఛాంపియన్ లీగ్‌లో రొనాల్డో లేకపోవడం పోర్చుగల్ జట్టుకు భారీ నష్టమేనంటూ క్రీడాభిమానులు వెల్లడిస్తున్నారు. IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం స్వీడన్‌, పోర్చుగల్ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల క్రీడాకారులకు ముందుగా కొవిడ్-19 పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రొనాల్డోకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. మీగతా ఆటగాళ్లందరికీ కరోనా నెగెటివ్‌‌గా తేలిందని ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది.  రొనాల్డొ పోర్చుగల్‌ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్‌ సాధించాడు.  అయితే.. తన అభిమాన క్రీడాకారుడు సాకర్ స్టార్ కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ.. రొనాల్డో అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్‌లు చేస్తున్నారు.  Ishant Sharma rib injury: ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ శర్మ ఔట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe