Ishant Sharma rib injury: ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ శర్మ ఔట్

Delhi capitals pacer Ishant Sharma ruled out of IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా ఐపిఎల్ 2020 నుండి దూరమయ్యాడు. ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ నిష్క్రమించినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఇషాంత్ శర్మ.. గాయం కారణంగా మిగతా మ్యాచ్‌కు దూరమయ్యాడు. 

Last Updated : Oct 12, 2020, 09:55 PM IST
Ishant Sharma rib injury: ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ శర్మ ఔట్

Delhi capitals pacer Ishant Sharma ruled out of IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా ఐపిఎల్ 2020 నుండి దూరమయ్యాడు. ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ నిష్క్రమించినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఇషాంత్ శర్మ.. అక్టోబర్ 7న జరిగిన ట్రైనింగ్ సెషన్‌లో గాయపడి ( Ishant Sharma injured ) అప్పటి నుంచి జరిగిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఛాతిలో ఎడమవైపు కండరాల గాయంతో బాధపడుతున్న కారణంగా ఇషాంత్ ఐపిఎల్ 2020 నుండి వైదలగాల్సి వచ్చినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ స్పష్టంచేసింది. Also read : Sunil Narine's bowling: సునీల్ నరైన్ బౌలింగ్‌పై KKR స్పందన

IPL 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లను గాయాలు వేధించడం ఇదేం తొలిసారి కాదు. ఇదివరకే ఇదే జట్టుకు చెందిన స్పిన్నర్ అమిత్ మిశ్రా ( Amit Mishra ruled out of IPL 2020 ) గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగగా.. తాజాగా మరోసారి ఇషాంత్ శర్మ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇషాంత్ శర్మ లాంటి సీనియర్ పేసర్ టోర్నమెంట్ నుండి దూరం అవ్వాల్సి రావడం ఢిల్లీ క్యాపిటల్స్‌కి ( Delhi Capitals ) ఇబ్బందికరమైన పరిణామమే.  

అమిత్ మిశ్రా కంటే ముందుగా సెప్టెంబర్ 20న ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ ( Ravichandran Ashwin injured ) భుజానికి గాయమైంది. దాంతో అతడు ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అదృష్టవశాత్తుగా ఆ తర్వాత అశ్విన్ కోలుకోవడంతో మళ్లీ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్నాడు. కానీ అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మల విషయంలో అలా జరగలేదు. Also read : IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News