Prithvi Raj Yarra: సన్‌రైజర్స్ టీమ్‌లోకి పృథ్వీరాజ్.. ఎవరీ తెలుగు తేజం ?
Prithvi Raj Yarra in SRH: పృథ్వీ రాజ్ యర్ర.. ఐపిఎల్ 2020లో ఇప్పుడు కొత్తగా వినబడుతున్న పేరు ఇది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పేసర్ భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar ) గాయంతో జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడే ఈ తెలుగు తేజం పృథ్వీరాజ్ యర్ర. Prithvi Raj Yarra cricket career ఎవరీ పృథ్వీరాజ్.. ప్రస్థానం ఏంటి...
Prithvi Raj Yarra in SRH: పృథ్వీ రాజ్ యర్ర.. ఐపిఎల్ 2020లో ఇప్పుడు కొత్తగా వినబడుతున్న పేరు ఇది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్టులో పేసర్ భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar ) గాయంతో జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడే ఈ తెలుగు తేజం పృథ్వీరాజ్ యర్ర ( Prithviraj Yarra ). గాయం కారణంగా ఐపిఎల్ 2020 నుంచి నిష్క్రమిస్తున్న భువి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ.. భువి స్థానంలో పృథ్వీరాజ్ జట్టులో చేరనున్నట్టు స్పష్టంచేసింది. Also read : Steve Smith: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!
Prithvi Raj Yarra cricket career ఎవరీ పృథ్వీరాజ్.. ప్రస్థానం ఏంటి...
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని దుగ్గిరాలకు చెందిన పృథ్వీరాజ్.. విద్యాభ్యాసం అంతా వైజాగ్‌లో కొనసాగింది. తండ్రి శ్రీనివాస రావు సివిల్ ఇంజనీర్ కాగా తల్లి కృష్ణకుమారి వైజాగ్ ట్రాన్స్‌కో విభాగంలో పనిచేస్తున్నారు. 1985లోనే తండ్రి శ్రీనివాస రావు ఏపీ తరపున జావెలిన్ థ్రోలో ఛాంపియన్‌గా నిలిచారు. ఆ అనుభవంతోనే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ తనయుడిని క్రికెట్‌లో ప్రోత్సహించారు.
విశాఖలోనే క్రికెట్‌లో మెళకువలు నేర్చుకున్న పృథ్వీరాజ్.. రాష్ట్రం తరపున అండర్ 14, 16, 19, 23 విభాగాల్లో పాల్గొని తనని తాను నిరూపించుకున్నాడు. అలా రంజీ, దులీప్ ట్రోఫీల్లోనూ సత్తా చాటుకున్న ఈ యువ కెరటం.. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది ఐపిఎల్ టోర్నమెంట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడాడు. Also read : R Ashwin tweets Mankading: ఇదే ఫైనల్ వార్నింగ్.. అశ్విన్ ట్వీట్‌పై పేలుతున్న జోకులు..
యాదృశ్చికంగా గతేడాదే తొలిసారిగా ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) తరపున ఆడిన తొలి మ్యాచ్‌లో పోటీపడింది సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే ( Sunrisers Hyderabad ). ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్‌లోనూ పృథ్వీ బౌలింగ్ వేశాడు. ఐతే ఆ సీజన్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పృథ్వీని జట్టులోంచి రిలీజ్ చేసింది. Also read : MI vs RR match highlights: రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్
మరోవైపు గాయంతో ఐపిఎల్ 2020 కి దూరమైన భువనేశ్వర్ కుమార్ కనీసం 6-8 వారాలపాటు ఆటకు దూరం కానున్నాడు. సన్‌రైజర్స్‌లో సీనియర్ పేసర్ అయిన భువనేశ్వర్ జట్టుకు దూరం అవడం ఒక రకంగా ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. ఇప్పటికే పాయింట్స్ పట్టికలో ( IPL 2020 points table ) సెకండ్ హాఫ్‌లో కింది నుండి మూడో స్థానంలో కొనసాగుతున్న జట్టుకు ఇకపై జర్నీ మరింత కష్టం కానుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అలాంటి భువి స్థానంలో వస్తున్న పృథ్వీరాజ్ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకోనున్నాడో చూడాలి మరి. Also read : IPL 2020: SRH పేసర్ భువనేశ్వర్ కుమార్ ఔట్.. సన్‌రైజర్స్‌కు ఈ సీజన్ కష్టమే!