ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు భువనేశ్వర్ కుమార్ వైదొలిగాడు (Bhuvneshwar Kumar Ruled out of IPL 2020). చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తూ స్టార్ పేసర్ భువీ గాయపడటం తెలిసిందే. గాయం కారణంగా భువనేశ్వర్ ఐపీఎల్ 2020 టోర్నీకి మొత్తం దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్గాలు ఏఎన్ఐ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించాయి. కీలక బౌలర్ భువీ తప్పుకోవడం సన్‌రైజర్స్‌కు శాపంగా మారనుంది.
ఇప్పటికే ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఒక్క మ్యాచ్‌తోనే గాయపడి ఐపీఎల్ తాజా సీజన్‌కు దూరం కావాల్సి వచ్చింది. తాజాగా భువీ సైతం గాయం కారణంగా తాజా టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. కేవలం చెన్నైతో మ్యాచ్‌లో తన కోటా చివరి ఓవర్ వేయలేక భువనేశ్వర్ దూరం కావడంతో ధోనీ సారథ్యంలోని జట్టు విజయం సాధించింది. భువీ లేకపోతే బౌలింగ్‌లో తేలిపోయే సన్‌రైజర్స్ తర్వాతి మ్యాచ్‌లలో ఎలా ఆడనుందనేది ఆసక్తిగా మారింది.
తొలుత కేవలం కొన్ని మ్యాచ్‌లకు పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరం కానున్నాడని సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావించాడు. కానీ, గాయం (Hip Injury) తీవ్రత అధికంగా ఉండటంతో భువీ సేవలు ఈ సీజన్‌లో అందుబాటులో ఉండవని తేలిపోయింది. రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ సాధించిన భువీ లేకపోతే సన్‌రైజర్స్ క్వాలిఫయర్స్‌కు వెళ్లడం కూడా కష్టమే అవుతుంది. మరోవైపు విజయ్ శంకర్‌కు అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe