Pro Kabaddi Telugu Titans: కబడ్డీ గేమ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8 (పీకేఎల్) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ షెరటన్ గ్రాండ్ వేదికగా జరిగిన పీకేఎల్ రెండో మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ టీమ్ తో తెలుగు టైటాన్స్ తలపడ్డారు. చివరి వరకు ఆసక్తిగా జరిగిన ఈ మ్యాచ్ 40-40 పాయింట్లతో డ్రాగా ముగిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ జట్టుకు చెందిన మంజీత్ 12 పాయింట్లుతో స్టార్ రైడర్ గా నిలిచాడు. అయితే తెలుగు టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధార్థ్ దేశాయ్.. చాలా సమయం పాటు మ్యాట్ కు దూరంగా ఉన్నాడు. అయితే టైటాన్స్ కు అవసరమైన సమయంలో 11 పాయింట్లు సాధించి జట్టును ఆదుకున్నాడు. ప్రథమార్ధానికి 21-23తో వెనుకబడ్డ టైటాన్స్‌ సెకండ్ హాఫ్ లో పుంజుకుని స్కోరును సమం చేసింది. 


తొలి మ్యాచ్ లో ముంబయిదే విజయం


టోర్నీ తొలి మ్యాచ్‌లో యు ముంబా తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ఆ జట్టు 46-30 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. పీకేఎల్‌ చరిత్రలో ఓ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు నమోదు చేసిన జట్టుగా ముంబా నిలిచింది. ఆ జట్టులో అభిషేక్‌ (19) రైడింగ్‌లో అదరగొట్టగా.. ట్యాక్లింగ్‌లో హరేంద్ర (4), ఆశిష్‌ (3) రాణించారు.


బెంగళూరు బుల్స్‌ తరపున కెప్టెన్‌ పవన్‌ షెరావత్‌ (12), చంద్రన్‌ (13) పోరాడినా ఓటమి తప్పలేదు. ముంబా ప్రథమార్ధంలోనే 24-17తో పైచేయి సాధించింది. తొలి రోజు చివరి మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 38-33తో యూపీ యోధాను ఓడించింది. తొలి మ్యాచ్‌కు ముందు ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా వర్చువల్‌గా జాతీయ గీతం ఆలపించాడు. కథానాయకుడు ఎన్టీఆర్‌ హిందీ, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో ప్రొ కబడ్డీ వ్యాఖ్యానం చేయడం విశేషం.   


Also Read: Team India vs South Africa: టీమ్ ఇండియా స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసిన దక్షిణాఫ్రికా


Also Read: Pakistani Cricketers Wives: మోడల్స్‌ను తలపించే అందమైన పాకిస్తానీ క్రికెటర్ల భార్యలు వీళ్లే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి