Team India vs South Africa: ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ముప్పు వెంటాడుతున్నా..టీమ్ ఇండియా మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలు దేరింది. ఆటగాళ్ల క్షేమం గురించి ఆందోళన వెంటాడుతున్న నేపధ్యంలో దక్షిణాఫ్రికా కీలక ప్రకటన చేసింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికా దేశానికి టీమ్ ఇండియా(Team India)క్రికెట్ టీమ్ పర్యటనకు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం టీమ్ ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, ముప్పు భయం వెంటాడుతున్న నేపధ్యంలో టీ20 సిరీస్ మాత్రం వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లు యధాతధంగా జరగనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు దక్షిణాఫ్రికాలో ప్రాక్టీసు ప్రారంభించాయి. అదే సమయంలో క్రికెట్ అభిమానులు, టీమ్ ఇండియా క్రికెటర్ల కుటుంబసభ్యులకు ఆటగాళ్ల క్షేమం విషయమై భయం వెంటాడుతోంది.
ఒమిక్రాన్ భయం (Omicron Variant)వెంటాడుతున్న నేపధ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది. కేవలం డబ్బు కోసం క్రికెటర్ల జీవితాల్ని ప్రమాదంలో నెట్టడం సరైంది కాదనే విమర్శలు బీసీసీఐపై(BCCI) వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మంజ్రా కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఒమిక్రాన్ సంక్రమణ మరింతగా పెరిగి..సరిహద్దులు మూసేయాల్సిన పరిస్థితులు తలెత్తితే..తక్షణం టీమ్ ఇండియా క్రికెటర్లను వెంటనే స్వదేశానికి అంటే ఇండియాకు తిరిగి పంపించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు.
టీమ్ ఇండియా(Team India)ఆటగాళ్ల జట్టు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకన్నామని డాక్టర్ మంజ్రా తెలిపారు. ఏదైనా కారణంతో ఒకవేళ దక్షిణాఫ్రికా విడిచి ఇండియాకు వెళ్లాలనుకుంటే అప్పటికప్పుడే తిరిగి వెళ్లిపోవచ్చని చెప్పారు. ఆ సమయంలో ఒకవేళ సరిహద్దులు మూసేసినా సరే..ఇండియాకు పంపించేందుకు వీలుగా కావల్సిన అన్ని అనుమతుల్ని తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐ అధికారి కూడా స్పందించారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులతో టచ్‌లో ఉన్నామని..టీమ్ ఇండియా సురక్షితమైన పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ఏ మాత్రం ఇబ్బంది కలిగినా..వెంటనే ఇండియాకు వచ్చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్టు దక్షిణాఫ్రికా (South Africa)చెప్పిందన్నారు.
Also read: IND vs SA: దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! భారత బ్యాటర్లకు పండగే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook