MI vs PBKS, IPL 2022: Jonty Rhodes touching Sachin Tendulkar's feet: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాత్రి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (52; 32 బంతుల్లో  6ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 199 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 9 వికెట్లకు 186 పరుగులే చేసి 12 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (49), సూర్యకుమార్‌ యాదవ్‌ (43) టాప్ స్కోరర్లు. దాంతో ఐపీఎల్ 2022లో ముంబై ఇంకా ఖాతానే ఓపెన్ చేయలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం మైదానంలో ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఎప్పటిలానే ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటుండగా.. పంజాబ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్ టెండూల్కర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. అనంతరం క్రికెట్ దిగ్గజం పాదాలకు నమస్కారం చేయబోయాడు. ఇది గమనించిన సచిన్‌.. వద్దని జాంటీని అడ్డుకున్నాడు. అయినా కూడా ఊరుకోని జాంటీ.. సచిన్ పాదాలను తాకాడు. ఆపై ఇద్దరు ఆత్మీయంగా హత్తుకున్నారు. 


ఈ దృశ్యం చుసిన అక్కడున్న పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల ఆటగాళ్లు నవ్వులు పూయించారు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి సచిన్ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్ జట్టుతో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఆటగాడిగా, ఆపై కోచ్‌గా.. ఇప్పుడు మెంటార్‌గా ఉన్నాడు. మరోవైపు గతంలో ముంబై సపోర్టు స్టాఫ్‌లో జాంటీ రోడ్స్ పని చేశాడు. పరుగులకు మారుపేరు సచిన్ అయితే.. ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు జాంటీ. 



క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్‌ పాదాలను ఇప్పటికి ఎందరో తాకిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో సచిన్ పాదాలను తాకి క్రికెటర్లు తమ అభిమానంను చాటుకున్నారు. 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన ఎంఎస్‌సీ, రెస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ కూడా క్రికెట్ దిగ్గజం పాదాలకు నమస్కరించాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు,  463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. 


Also Read: Hardik Pandya Throw: లైవ్ మ్యాచ్ లో స్టంప్ ను విరగ్గొట్టిన హార్దిక్ పాండ్యా- మ్యాచ్ కు అంతరాయం!


Also Read: TG Traffic challan: నేడే లాస్ట్​ డేట్​- మీ వాహనాలపై పెండింగ్ చలాన్​లు​ చెల్లించారా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook