ఒలింపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధు
PV Sindhu beats Bing Jiao to Win bronze medal in Tokyo olympics: పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకుంది. చైనా షట్లర్ బింగ్ జియావోతో జరిగిన బ్యాడ్మింటన్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో పీవీ సింధు (PV Sindhu) చెలరేగిపోయింది. జరిగిన రెండు మ్యాచుల్లోనూ 21-13, 21-15 పాయింట్స్ తేడాతో పైచేయి సాధించి తన సత్తా చాటుకుంది.
PV Sindhu beats Bing Jiao to Win bronze medal in Tokyo olympics: పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకుంది. చైనా షట్లర్ బింగ్ జియావోతో జరిగిన బ్యాడ్మింటన్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో పీవీ సింధు చెలరేగిపోయింది. జరిగిన రెండు మ్యాచుల్లోనూ 21-13, 21-15 పాయింట్స్ తేడాతో పైచేయి సాధించి తన సత్తా చాటుకుంది. టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో స్వర్ణం చేజార్చుకున్న పీవీ సింధు ఈ మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజయం సాధించి, కాంస్య పథకం (Bronze medal) కైవసం చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకున్న పీవీ సింధు (PV Sindhu journey in Tokyo olympics).. రెండు ఒలంపిక్స్ మెడల్స్ గెల్చుకున్న తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. పివి సింధు సాధించిన ఈ చారిత్రక విజయానికి టోక్యోలోని ముసాహినో ఫారెస్ట్ స్పోర్ట్స్ ప్లాజా కోర్టు 1 వేదికైంది.
Also read : ఆవిరైన ఇండియా స్వర్ణం ఆశలు, టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో పీవీ సింధూ ఓటమి
2016 ఒలింపిక్స్ గేమ్స్‌లో రజత పథకం గెల్చుకున్న పివి సింధు 2021 ఒలింపిక్స్‌లో (PV Sindhu) స్వర్ణం సొంతం చేసుకుని తన మెడల్స్ ర్యాంకుని మరింత మెరుగుపర్చుకుంటుందని ఆమె అభిమానులు ఆశించారు. కానీ ఊహించని విధంగా చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చేతిలో సింధు ఓటమిపాలైంది. ఏదేతైనేం నేడు అదే చైనాకు చెందిన మరో క్రీడాకారిణిని (He Bing Jiao) మట్టికరిపించి కాంస్య పథకం కైవసం చేసుకోవడమే కాకుండా చరిత్ర కూడా సృష్టించింది.
Also read : Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ప్రకటనలకు దూరంగా టొయోటా కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook