Tokyo Olympics: జపాన్ ఒలింపిక్స్ నుంచి స్వదేశీ దిగ్గజ బ్రాండ్ దూరమైంది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌లో మేజర్ స్పాన్సర్ ఈసారి టాటా చెప్పేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ కంపెనీ ప్రచారం ఇకపై కన్పించదు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC)కు మేజర్ స్పాన్సర్‌గా టొయోటా కంపెనీ చాలాకాలంగా వ్యవహరిస్తోంది. అయితే జపాన్‌కు చెందిన ఈ కంపెనీ సొంతదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌కు దూరమైంది. కరోనా సంక్షోభం నేపధ్యంలో ప్రజల అయిష్టత మధ్య జరుగుతున్న ఒలింపిక్స్‌లో ప్రచారమనేది..మేలు కంటే కీడుకే ఆస్కారముందని కంపెనీ భావించింది. అందుకే ఈసారి ఒలింపిక్స్ సమయంలో వచ్చే యాడ్స్ నుంచి కంపెనీ తప్పుకుంది. టొయోటా(Toyota) బ్రాండ్ ఒలింపిక్స్ సమయంలో యాడ్స్‌లో కన్పించకూడదనేది కంపెనీ నిర్ణయం.
ఒలింపిక్ గేమ్స్(Olympic games) జరిగినంతవరకూ టీవీలో టొయోటా ప్రకటనలు కన్పించవిక. కంపెనీ ప్రతినిధులు కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. 8 ఏళ్ల కాలానికి ఐఓసీకు దాదాపు 7 వేల కోట్లు చెల్లిస్తోంది టొయోటా. టోక్యో ఒలింపిక్స్(Tokyo olympics) నిర్వహణపై ప్రజల్లో ఇష్టం లేకపోవడంతో..కంపెనీ ప్రకటనలు కీడు చేకూరుస్తాయనేది కంపెనీ ఆలోచన. అటు దక్షిణ కొరియా అధ్యక్షుడు సైతం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరుకావడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook