రఫేల్ నాదల్ ( Rafael Nadal ) అరుదైన విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2020లో ( French Open 2020 ) సెర్బియాకు చెందిన క్రీడాకారులు నోవాక్ జోకోవిక్ తో జరిగిన మ్యాచులో 6-0. 6-2. 7-5తో విజయం సాధించి 20వ సారి గ్రాండ్ స్లామ్ గెలిచిన రోజర్ ఫెదరర్ రికార్డును బ్రేక్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ | RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో
ప్రపంచ నెంబర్. 1 నోవాక్ మంచి ఆటతీరు కనబరచగా 34 సంవత్సరాల నాదల్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయంతో దూసుకెళ్లాడు. ఒక్క సెట్ కోల్పోకుండా నాదల్ గెలుపు సాధించాడు.



నాదల్ విజయంతో దూసుకెళ్లగా జోకోవిచ్ (  Novak Djokovic)మాత్రం ఈ ఏడాది తొలిసారి ఓటమి రుచిని చవి చూశాడు. అంతకు ముందు యూఎస్ ఓపెన్ నుంచి అనర్హత వేటు వల్ల బయటకు వచ్చాడు. ఈ విజయతో నాదల్, రోజర్ ఫెదరర్ ఇప్పుడు 20 గ్రాండ్ స్లామ్ విజేతల జాబితాలో పోటీలో ఉంటారు. 


మరో గ్రాండ్ స్లామ్ ఎవరునెగ్గినా వారు ముందువరుసలో ఉంటారు. అయితే కీళ్ల సర్జరీ అవడం వల్ల ఫెదరర్ ఈ ఏడాది మొత్తం ఆటకు దూరంగా ఉండనున్నాడు. అయితే 2021లో జరితే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో అతను టైటిల్ నెగ్గితే టాప్ నెంబర్ జాబితాలో టాప్ స్థాయికి వెళ్తాడు. వచ్చే ఏడాది 40 ఏళ్ల పూర్తి అవుతాయి కాబట్టి అతనికి అదే చివరి టోర్నీ అవ్వవచ్చు. 


ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR