India enters U19 World Cup 2022 Semi Finals: కరోనా వైరస్ మహమ్మారి కలవరపెట్టినా వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత జట్టు (India U19) అండర్‌-19 ప్రపంచకప్‌ (U19 World Cup) 2022లో సెమీస్‌కు దూసుకెళ్లింది. అంటిగ్వా వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌తో (IND vs BAN) శనివారం రాత్రి జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత ఓపెనర్‌ అంగ్‌కృష్‌ రఘువంశీ (44; 65 బంతుల్లో 7 ఫోర్లు), వైస్ కెప్టెన్ షేక్‌ రషీద్‌ (26; 59 బంతుల్లో 3 ఫోర్లు), పేసర్ రవి కుమార్ (7-1-14-3) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గతేడాది జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్ రవి కుమార్‌ దెబ్బకు బంగ్లా ఓపెనర్లు మెహ్‌ఫిజుల్ ఇస్లామ్‌ (2), ఇఫ్తకర్‌ హోసైన్‌ ఇఫ్తీ (1) సహా వన్ డౌన్ బ్యాటర్ ప్రాంతిక్‌ నవ్రోజ్‌ నబిల్‌ (7) స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. ఈ సమయంలో ఐచ్ మొల్లా (17) కాసేపు క్రీజులో నిలబడినా.. అరిఫుల్ ఇస్లాం (9), ఎండి ఫహీమ్ (0), రకీబుల్ హసన్ (7) త్వరగానే పెవిలియన్ చేరడంతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. 


ఓ దశలో బంగ్లాదేశ్ 100 పరుగులు అయినా చేస్తుందా అన్న అనుమానం అందరిలో కలిగింది. అయితే చివరలో బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఎమ్ మెహ్రోబ్‌ (30), అషికర్‌ జమాన్‌ (16) జట్టును ఆదుకున్నారు. మెహ్రోబ్‌ ధాటిగా ఆడి బంగ్లా స్కోరును 100 దాటించాడు. చివరకు బంగ్లా 38వ ఓవర్లో ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవి కుమార్‌ మూడు పడగొట్టగా.. విక్కీ ఓస్వాల్‌ రెండు వికెట్లు తీశాడు. 



112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హర్నూర్‌ సింగ్‌ డౌకటయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాటర్ షేక్‌ రషీద్‌ (26)తో కలిసి మరో ఓపెనర్‌ రఘువంశీ (44) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్వల్వ వ్యవధిలోనే ఈ జోడి ఔట్ అయింది. ఆపై సిద్ధార్థ్‌ యాదవ్‌, రాజ్‌ బవా త్వరగానే ఔట్ అయినా కెప్టెన్‌ యశ్‌ధూల్‌ (20 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.


Also Read: Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!!


Also Read: Black Snow in Russia: అయ్యో.. అక్కడ మంచు నల్లగా కురుస్తోందట! ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook