హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ (Rahul Dravid) రాహుల్ ద్రావిడ్‌ టీమిండియా కోచ్ ప‌ద‌విని తిర‌స్క‌రించారని (committee of administrators bcci) COA క‌మిటీ ఆప్ అడ్మినిస్ట్రేట‌ర్స్ వినోద్ రాయ్ తెలిపారు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల‌ని ద్రావిడ్‌కు ఆఫ‌ర్ ఇవ్వగా సున్నితంగా తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. అయితే కుటుంబంతో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌న్న ఉద్దేశంతో ద్రావిడ్ ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాయ్ వెల్ల‌డించారు. కాగా రాహుల్‌తో కోచ్ ప‌ద‌వి గురించి చ‌ర్చించామ‌ని, కానీ త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నార‌ని, ఇన్నాళ్లూ ఇండియ‌న్ టీమ్‌తో దేశ‌విదేశాల్లో టూర్ చేయ‌డం వ‌ల్ల వారికి ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోయాన‌ని, అందుకే ఇప్పుడు ఎక్కువ శాతం ఇంటి వ‌ద్ద ఉండాల‌నుకున్న‌ట్లు ద్రావిడ్ చెప్పిన‌ట్లు రాయ్ తెలిపారు.  సచిన్‌కు బౌలింగ్ చేయడం అంత సులువు కాదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సచిన్ స్ట్రైకింగ్ ఎందుకు తీసుకోడు.. సీక్రెట్ చెప్పిన గంగూలీ


2017లో అనిల్ కుంబ్లే(Anil Kumble) అర్థాంత‌రంగా కోచ్ బాధ్య‌త‌లు వ‌దిలేసిన స‌మ‌యంలో భార‌త క్రికెట్ రంగం కొంత త‌డ‌బాటుకు గురైంది. అయితే కోచ్‌గా ర‌విశాస్త్రికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డానికి ముందు ద్రావిడ్‌ను సంప్ర‌దించిన‌ట్లు రాయ్ వెల్లడించారు. ఆ స‌మ‌యంలో అండ‌ర్‌-19 కోచ్‌గా ద్రావిడ్ ఉన్నారు. అయితే ఆ తరహాలోనే ద్రావిడ్ కొన‌సాగాల‌నుకున్న‌ట్లు చెప్పారు. 


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..