హైదరాబాద్: కరోనా మహమ్మారి Covid-19 కారణంగా ఈ ఏడాది జరగాల్సిన (IPL) ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్ పరిస్థితిని బట్టి ఐపీఎల్ 13 అక్టోబర్, నవంబర్‌లో జరుగనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోవిడ్ -19 లాక్డౌన్ తర్వాత టోర్నీ నిర్వాహణను రూపొందించడానికి గురువారం ఒక సమావేశం షెడ్యూల్ చేయబడింది. ఐపీఎల్ 2020 లో జరుగుతుందని పలువురు మాజీ ఆటగాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: లాక్‌డౌన్ పాటించను.. MamataBanerjeeకి బీజేపీ నేత సవాల్
భారత మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఈ ఏడాది ఐపిఎల్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు లేకుండానే టోర్నీ జరగవచ్చని కుంబ్లే అభిప్రాయపడ్డారు. షెడ్యూల్ ప్రకారమే ఈ సంవత్సరం ఐపీఎల్ నిర్వహణకు అవకాశముందని, తాము ఇంకా ఆశాజనకంగానే ఉన్నామని Anil Kumble కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్ట్’ ద్వారా పేర్కొన్నారు.
Also Read: IMD: చల్లని సమాచారాన్ని పంపిన వాతావరణ శాఖ..
ఇదే అంశంపై మాజీ భారత బ్యాట్స్‌మన్ (VVS Laxaman) వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల ప్రయాణాన్ని తగ్గించడానికి ఎక్కువ స్టేడియాలు ఉన్న నగరాల్లో ఫ్రాంచైజీలు లీగ్‌ను నిర్వహించవచ్చన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..