హైదరాబాద్ : శ్రీలంకతో గువహాటిలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుందని అస్సామ్ క్రికెట్ అసోసియేషన్ తెలియజేసింది. శ్రీలంకతో భారత్ మూడు టీ20 ఆడనుంది. ఈ టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శిఖర ధావన్ వచ్చాడు. 


ఓపెనర్ గా కేఎల్  రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆడనున్నాడు. మహమ్మద్ షమీ స్థానంలో మూడు నెలల తర్వాత జస్పిత్ బుమ్రా తిరిగి జట్టులోకి  రీఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ లేకపోవడంతో కెప్టెన్ కోహ్లీ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో వేచి చూడాల్సిందే...