Rajasthan Royals Pacer Chetan Sakariya | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో చేతన్ సకారియా తండ్రి కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట కోవిడ్19 బారిన పడిన సకారియా తండ్రిని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి చెందిన అధికారులు జాతీయ మీడియా ఏఎన్ఐకి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2021లో వెలుగులోకి వచ్చిన అతికొద్ది మంది టాలెంటెడ్ క్రికెటర్లలో రాజస్తాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియా ఒకడు. కానీ ఈ ఏడాది IPL 2021 యువ క్రికెటర్ ఇంట్లో వరుస విషాదాలో చోటుచేసుకుంటున్నాయి. జనవరి నెలలో చేతన్ సకారియా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతడి సోదరుడు చనిపోయాడు. తాజాగా కరోనా బారిన పడి అతడి తండ్రి కన్నుమూయడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  


Also Read: Koppula Eshwar: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు COVID-19 పాజిటివ్ 


కాగా, కరోనా మహమ్మారి టీమిండియా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు నెల రోజుల కిందట వేద కృష్ణమూర్తి తల్లి కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాదాన్ని మరిచిపోయేలోగా ఆ క్రికెటర్ సోదరిని సైతం కరోనా మహమ్మారి కబలించింది. ఒకే ఇంట్లో ఇద్దరు కోవిడ్19 బారిన పడి నెల రోజుల వ్యవధిలో చనిపోవడం వేద కృష్ణమూర్తి(Veda Krishnamurthy)ని విషాదంలోకి నెట్టేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook