RR vs CSK matches highlights: ఐపిఎల్ 2020లో భాగంగా నేడు మంగళవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌తో రాజస్థాన్ రాయల్స్ తమ ఐపిఎల్ పోరును ప్రారంభించనుంది. ఐపిఎల్‌లో మూడుసార్లు టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ( Chennai Super Kings ) రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం జరిగిన కర్టెన్-రైజర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్, నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ విజేతలు అయిన ముంబై ఇండియన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఐపిఎల్ 2020లో మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) సేన చక్కటి ఆరంభాన్ని అందుకుంది. అంబటి రాయుడు ( Ambati Rayudu ), డు ప్లెసిస్ ( Faf du Plessis ) చెరో హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ రాయల్స్‌పై ( Rajastan Royals ) మ్యాచ్‌లోనూ అటువంటి ప్రతిభే కనబర్చి రెండో మ్యాచ్‌లోనూ గెలుపును సొంతం చేసుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇంగ్లాండ్ ద్వయం జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ దూరమవడం తీవ్ర ఇబ్బందికి గురిచేసే అంశం కానుంది. అంతేకాకుండా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) సైతం గాయంతో బాధపడుతున్నందున అతడు కూడా మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read : CSKvsRR: కరోనా నుంచి కోలుకున్న సీఎస్కే కీలక ఆటగాడు


ఐపిఎల్ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే.. ఐపిఎల్‌లో రెండవ అత్యంత విజయవంతమైన జట్టుగా, 2010, 2011, 2018 సీజన్స్‌లో మొత్తం మూడుసార్లు టోర్నమెంట్‌ను గెలుచుకున్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కి పేరుంది. అత్యధికంగా ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లో ఆడిన జట్టుగానూ రికార్డులను సొంతం చేసుకుంది.


రాజస్థాన్ రాయల్స్, 2008లో ఐపిఎల్ ప్రారంభ ఎడిషన్‌లోనే ఫైనల్లో సిఎస్‌కెను ( CSK ) ఓడించి ఈ జట్టు ఆ తర్వాత 2013, 2015, 2018 సంవత్సరాల్లో ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. Also read : Devdutt Padikkal in IPL : ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్ ?


రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, డ్రీమ్ 11 టీమ్ ప్రెడిక్షన్


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రెడిక్షన్:


వికెట్ కీపర్: ఎంఎస్ ధోని


బ్యాట్స్‌మెన్: అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, యశస్వి జైస్వాల్, రాబిన్ ఉతప్ప


ఆల్ రౌండర్లు: సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా


బౌలర్లు: జోఫ్రా ఆర్చర్, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా Also read : MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్‌లో ట్రోలింగ్


Probable players in RR team రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడే ఆటగాళ్ల జాబితా ( ప్రాబబుల్స్ ):
రాబిన్ ఉతప్ప, యషస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్ (సి), సంజు సామ్సన్, డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, మయంక్ మార్కండే / రాహుల్ తెవాటియా, టామ్ కుర్రాన్.


Probable players in CSK team చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడే ఆటగాళ్ల జాబితా ( ప్రాబబుల్స్ ):
షేన్ వాట్సన్, మురళీ విజయ్ / రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని ( సి అండ్ డబ్ల్యుకె ), కేదార్ జాదవ్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగి ఎన్గిడి. Also read : 
ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe