Yashasvi Jaiswal joined Sachin Tendulkar elite list: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2021-22లో ముంబై బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ అదరగొడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 227 బంతుల్లో 100 పరుగులు చేసిన యశస్వి.. రెండో ఇన్నింగ్స్‌లో 372 బంతుల్లో 181 పరుగులు చేశాడు. దాంతో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచ‌రీలు చేసిన‌ ముంబై ఆట‌గాళ్ల ఎలైట్ జాబితాలో యశస్వి చోటు ద‌క్కించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచ‌రీలు చేయడంతో యశస్వి జైశ్వాల్‌ రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన ముంబై క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, టెస్ట్ స్పెషలిస్ట్ అజింక్య రహానే, మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ తదితరుల సరసన చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజాల సరసన యశస్వి పేరు చేరింది. 


మ్యాచ్ అనంతరం యశస్వి జైశ్వాల్‌ మాట్లాడుతూ... 'వికెట్‌ను బాగా అర్థం చేసుకున్నా. కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించింది. పృథ్వీ షా అవుటైన తర్వాత ఆర్మాన్‌ జాఫర్‌తో మాట్లాడి ఎలా ఆడాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. క్రీజులో నిలదొక్కున్న తర్వాతే షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాను. సెంచరీ మార్కు చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నా. అయితే క్రీజులో ఉండటమే అన్నింటి కంటే ముఖ్యమైనది అనుకున్నా. అందుకే ఓపికగా ఎదురుచూశాను' అని తెలిపాడు. 


'నిజానికి ఈ మ్యాచ్‌లో నేను సాధించిన రికార్డు గురించి నాకు తెలియదు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు రాగానే నా తోటి ఆటగాళ్లు విషయం చెప్పారు. సచిన్‌ సర్‌, వసీం సర్‌, రోహిత్‌, అజింక్య వంటి దిగ్గజాల సరసన నా పేరు చూసుకోవడం గర్వంగా ఉంది' అని యశస్వి జైశ్వాల్‌ చెప్పుకొచ్చాడు. ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేయగా.. 533 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 180కే ఆలౌట్‌ అయిన నేపథ్యంలో ముంబై ఫైనల్‌కు చేరుకుంది. 


Also Read: Umpire Catch: క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన అంపైర్‌.. చివరికి ఏమందంటే?


Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.14 వేలు విలువ చేసే థామ్సన్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4499కే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook