R Ashwin: 17 ఇన్నింగ్స్‌ల్లోనే.. రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును సమం చేసిన అశ్విన్! కుంబ్లేను అధిగమించాడు!!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ఆల్‌రౌండ్ గ్రేట్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డుని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ సమం చేశాడు. కివీస్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డు అందుకున్నాడు.
Ravichandran Ashwin equals Richard Hadlee's record for most wickets in IND vs NZ Test matches: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin ) రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పగా.. తాజాగా మరో రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ఆల్‌రౌండ్ గ్రేట్ రిచర్డ్ హ్యాడ్లీ (Richard Hadlee) రికార్డుని యాష్ సమం చేశాడు. కివీస్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డు అందుకున్నాడు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో రిచర్డ్ హ్యాడ్లీ (Richard Hadlee) 65 వికెట్లు పడగొట్టాడు. ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన ఆదివారం రాస్ టేలర్‌ను పెవిలియన్ పండపడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ కివీస్ మాజీ బౌలర్ హ్యాడ్లీ రికార్డును సమం చేశాడు. 65 వికెట్లు పడగొట్టడానికి హాడ్లీ 24 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. అశ్విన్ మాత్రం కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్ అందుకున్నాడు. రెండు టెస్టులో కివీస్ జట్టుకు ఇంకా ఐదు వికెట్లు ఉన్న నేపథ్యంలో యాష్ హ్యాడ్లీని అధిగమించే అవకాశం కూడా ఉంది.
Also Read: Samantha: సమంత ఏమాత్రం తగ్గట్లే.. బాలీవుడ్ భామలకు ధీటుగా! విడాకుల అనంతరం రికార్డు!!
ముంబై టెస్టు (Mumbai Test)లో ఆర్ అశ్విన్ మరో ఘనతను కూడా సాధించాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ వికెట్‌ను పడగొట్టడంతో.. టెస్టుల్లో క్యాలెండర్ ఇయర్‌లో 50 కంటే ఎక్కువ వికెట్లు ఎక్కువసార్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. యాష్ మొత్తంగా నాలుగు సార్లు (2015, 2016, 2017, 2021) ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 3 సార్లు (1999, 2004, 2006), వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 3 సార్లు (2001, 2002, 2008), మాజీ సారథి కపిల్ దేవ్ 2 సార్లు (1979, 1983) ఈ ఫీట్ సాధించారు.
Also Read: Kolkata: అర్ధరాత్రి రిస్క్ అనుకోకుండా.. ఆ బెంగాళీ మహిళ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపు దిశగా దూసుకెళుతోంది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (36), రచిన్ రవీంద్ర (2) క్రీజులో ఉన్నారు. ఆర్ అశ్విన్ (3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. చివరి రెండు రోజుల్లో కివీస్ గెలవాలంటే 400 పరుగులు చేయాల్సి ఉంది. ఐదు వికెట్లు తీస్తే విజయంతో పాటు సిరీస్ టీమిండియా సొంతమవుతుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌ను 276/7 వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకు ఆలౌట్ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook