Ravindra Jadeja Ruled Out From Asia Cup 2022 Due to Injury: ఆసియా కప్‌ 2022లో భాగంగా సూపర్ 4 మ్యాచులు ఆడనున్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. జడేజా స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచులలో జడ్డు అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రవీంద్ర జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. 'మోకాలి గాయంతో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసియా కప్‌ 2022 మిగతా టోర్నీకి దూరమయ్యాడు. జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి రానున్నాడు. ఆసియా కప్‌కు స్టాండ్‌-బై క్రికెటర్‌గా ఉన్న అక్షర్‌.. తుది జట్టులోకి వస్తాడు. దుబాయ్‌లోని జట్టుతో అతడు త్వరలోనే కాలుస్తాడు. ఇక జడేజా గాయం తీవ్రతపై ఎలాంటి స్పష్టత లేదు. జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. జడేజా దూరం కావడం జట్టుకు ఎదురుదెబ్బే' అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. 


ఆసియా కప్‌ 2022లో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజాకు బ్యాటింగ్‌ అవకాశం రానప్పటికీ.. ఫీల్డింగ్‌లో మెరిశాడు. జడ్డు చేసిన రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. సూపర్‌ 4లో భాగంగా  ఆదివారం (పాకిస్తాన్‌ లేదా హాంకాంగ్‌)తో జరిగే మ్యాచ్‌కు అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వస్తాడో లేదో చూడాలి. అక్షర్‌ జట్టులోకి రావడం దాదాపుగా కష్టమే అని చెప్పాలి. 



భారత జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్. 


Also Read: 'కింగ్ కోబ్రా'కే బాస్.. పడగవిప్పిన పాము తలపై ఒక్కటిచ్చాడుగా! ఆ తర్వాత ఏం జరిగిందంటే


Also Read: ఆ పాక్ పేసర్ ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 15 కోట్లు పక్కా.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook