Mahesh Pithiya: ఆసీస్ జట్టుకు ఓ రైతు కొడుకు సాయం.. అశ్విన్‌కు చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్
Ravindran Ashwin Duplicate Mahesh Pithiya: భారత గడ్డపై స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు మాస్లర్ ప్లాన్‌తో వస్తోంది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఓ రైతు కొడుకు సాయం తీసుకుంటోంది. ఇంతకు అతను ఎవరు..? కంగారూ జట్టుకు ఎలా సాయం చేస్తున్నాడు..?
Ravindran Ashwin Duplicate Mahesh Pithiya: గత 18 ఏళ్లలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేకపోయింది. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈసారి భారత మైదానాలకు అలవాటు పడేందుకు ముందుగానే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అంతకుముందే నార్త్ సిడ్నీలో భారత్‌లో వంటి పిచ్‌ను సిద్ధం చేసి ప్రాక్టీస్ చేసి వచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. అశ్విన్‌లా బౌలింగ్ చేసే జునాగఢ్‌కు చెందిన స్పిన్నర్ సాయం కూడా కంగారూ జట్టు తీసుకుంటోంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభంకానుంది.
మహేష్ పిథియా వయసు ఇప్పుడు 21 ఏళ్లు. గత డిసెంబర్‌లో బరోడా తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అశ్విన్ లాంటి బౌలింగ్ యాక్షన్ ఉండడంతో మంచి పేరు సంపాదించాడు. అందరూ అశ్విన్ డూప్లికేట్ అని కూడా పిలుస్తారు. ఇతని బౌలింగ్ యాక్షన్ వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆసీస్ జట్టు ఈ యంగ్ ప్లేయర్‌ను పిలిపించింది. గత మూడు రోజులుగా ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌కు డిఫరెంట్ టైపులో బౌలింగ్ చేయిస్తోంది. అశ్విన్‌కు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆసీస్ స్క్వాడ్ మొత్తం బస చేసిన హోటల్‌లోనే మహేష్ బస చేసి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు.
10 సంవత్సరాల క్రితం మొదటి క్రికెట్ మ్యాచ్ చూసిన మహేష్ పిథియా ఆస్ట్రేలియా జట్టులో చేరిన కథ ఆసక్తికరంగా ఉంది. కొంచెం వెనక్కి వెళితే.. 2013లో మహేష్ తన జీవితంలో తొలిసారిగా క్రికెట్ మ్యాచ్ చూశాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 10 సంవత్సరాలు. అతను నాగిచనలోని పాన్ షాప్ వద్ద మ్యాచ్ చూశాడు. ఈ పాన్ షాప్ నుంచి తన సొంతూరికి వెళ్లేందుకు చేరుకోవడానికి గంట సమయం పడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆర్.అశ్విన్ బౌలింగ్ కూడా చూశాడు. తన గ్రామంలో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేటప్పుడు అచ్చం అశ్విన్ స్టైల్‌లో బాల్ విసిరేవాడు.
మహేష్ క్రమంగా మెరుగైన ఆఫ్ స్పిన్నర్ అయ్యాడు. అన్ని వయసుల ప్లేయర్లతో కలిసి క్రికెట్ ఆడాడు. చివరకు మహేష్‌కు ఇటీవల ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇక్కడ బరోడా త్రో డౌన్ స్పెషలిస్ట్ ప్రితేష్ జోషి మహేష్ బౌలింగ్ యాక్షన్ వీడియోను ఆస్ట్రేలియా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌కి ఫార్వార్డ్ చేశాడు. భారత్‌లో జరిగే టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కావడానికి ఆస్ట్రేలియాకు నెట్ ప్రాక్టీస్‌లో కొంతమంది స్పిన్నర్లు అవసరం. మహేష్ యాక్షన్ చూసిన ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్ వెంటనే అతడిని నెట్ బౌలర్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు.
మూడు రోజుల క్రితం వరకు ఎవరికీ తెలియని మహేష్ ఇప్పుడు ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. మహేష్ తండ్రి జునాగఢ్‌లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. మూడు రోజుల వరకు మహేష్ గురించి ఎవరూ వినలేదు. అతను ఇప్పటివరకు నాలుగు రంజీ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 8 వికెట్ల తీసి.. బ్యాట్‌తో 116 పరుగులు కూడా చేశాడు. మహేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లకు నెట్ ప్రాక్టీస్ ఇస్తున్నాడు. గత రెండు రోజుల్లో స్టీవ్ స్మిత్‌కు అత్యధిక బంతులు వేసినట్లు మహేష్ చెప్పాడు. కొన్ని సందర్భాల్లో తాను స్మిత్‌ను కూడా అవుట్ చేశానని కూడా అన్నాడు.
Also Read: Ration Shops: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి వచ్చేసింది
Also Read: Amul Milk Price Hike: అమూల్ పాల ధర రూ.3 పెంపు.. కొత్త ధరలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook