RCB New Captain 2022: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలుకానుంది. ఐపీఎల్​ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను బీసీసీఐ పూర్తి చేసింది. ఈ సారి 10 టీమ్స్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఫ్రాంచైజీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు విదేశీ క్రికెటర్లు ఇండియాకు పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా తమ కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని దాచి పెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. శనివారం (మార్చి 12) అధికారికంగా ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు ఆర్సీబీ వెల్లడించింది. ఈ విషయంతో పాటు ఆర్సీబీకి చెందిన కొత్త లోగో, జెర్సీలను యాజమాన్యం ఆవిష్కరించింది. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన విరాట్ కోహ్లీ.. 2021లో కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ఈ క్రమంలో తమ కెప్టెన్ గా ఫాఫ్ డుప్లెసిస్ ను ఎంచుకున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది.   



ఐపీఎల్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్​ కింగ్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్ మధ్య జరగనుంది. అయితే ఈసారి కప్​ ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. గతేడాది ముంబయి ఇండియన్స్ విజేతగా నిలవడం వల్ల ఈ సీజన్ లోనూ అదే జట్టు ఫేవరేట్ గా బరిలో దిగనుంది. అయితే ఈ సారి టోర్నీలో మరో రెండు కొత్త జట్లు చేరనుండడం వల్ల ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.   


Also Read: IPL 2022: నేడే ఆర్​సీబీ కొత్త కెప్టెన్​ పేరు ప్రకటన- అతడివైపే అందరి చూపు..!


Also Read: India vs West Indies: ప్రపంచకప్ లో భారత్ జోరు.. వెస్టిండీస్‌ పై ఘన విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook