RCB v LSG Eliminator becomes highest viewed match in IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం (మే 25) ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో గెలుపు వాకిట బొక్కాబోర్లా పడిన లక్నో.. 15వ సీజన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గెలిచిన బెంగళూరు క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రజత్‌ పాటీదార్‌ (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ చివరలో దినేశ్‌ కార్తీక్‌ (37 నాటౌట్‌; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. లక్నో బౌలర్లు మోసిన్‌ఖాన్‌, కృనాల్‌ పాండ్యా, అవేశ్‌ఖాన్‌, రవి బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. బెంగళూరు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లకు 193 స్కోరుకే పరిమితం అయింది. కేఎల్ రాహుల్‌ (79), దీపక్‌ హుడా (45) రాణించారు. జోష్ హాజిల్‌వుడ్‌ (3/43) మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. 


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్ వీక్షణ పరంగా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2022లో ఎక్కువ మంది హాట్‌స్టార్‌గాలో చుసిన మ్యాచుగా నిలిచింది. ఈ మ్యాచ్ మొత్తం 8.7 మిలియన్ల క్రికెట్ ఫాన్స్ వీక్షించారు. ఇదివరకు ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచును అత్యధికంగా 8.3 మిలియన్ల మంది వీక్షించారు. ఆ రికార్డును బెంగళూరు, లక్నో మ్యాచ్ బద్దలు కొట్టింది. 


మరోవైపు ఐపీఎల్‌ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా బెంగళూరు రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్‌ 2022లో ఇప్పటి వరకు 136 సిక్స్‌లు బాదింది. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 135 సిక్స్‌లు బాదింది. ఎలిమినేటర్ మ్యాచుతో ఆ రికార్డును ఆర్‌సీబీ బద్దలు కొట్టింది. 


Also Read: Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.12,499కే అందుబాటులో!


Also Read: Clove Oil Benefits:  లవంగాల నూనెతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి