Clove Oil Benefits: లవంగాల నూనెతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Clove Oil Benefits: లవంగాలు వంటకాలకు రూచిని పెంచే ఓ సుగంధద్రవ్యం. దీనిని వంటకాల్లో వాడడం వల్ల శరీరాని దృఢత్వాన్ని అందజేయడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు  అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 12:12 PM IST
  • లవంగాల నూనె వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు
  • క్యాన్సర్‌ను నివారిస్తుంది
  • స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది
Clove Oil Benefits:  లవంగాల నూనెతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Clove Oil Benefits: లవంగాలు వంటకాలకు రుచిని పెంచే ఓ సుగంధద్రవ్యం. దీనిని వంటకాల్లో వాడడం వల్ల శరీరానికి దృఢత్వాన్ని అందజేయడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు  అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతే కాకుండా లవంగాలలో అనేక పోషక మూలకాలు ఉంటాయి. కావున చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, శరీర బలహీనతను దూరం చేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ శక్తిని పెంచడానికి కృషి చేస్తుంది.

ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా  పురుషులు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధుల కారణంగా బాధపడుతున్న వారికి  లవంగాలు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. అయితే వీటితో చేసిన నూనె పురుషులకు చాలా లాభాలను చేకూర్చుతుంది. అయితే ఈ నూనె వల్ల పురుషులకు వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

లవంగాల నూనె ప్రయోజనాలు:

క్యాన్సర్‌ను నివారిస్తుంది:

లవంగం నూనెలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యూజినాల్ మూలకాలు పురుషులకు వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది.

మత్తుని వదలిస్తుంది:

లవంగాల నూనె ఎలాంటి మత్తునైనా సులభంగా వదిలిస్తుంది. సిగరెట్ లేదా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలనుకునే వారు లవంగాల నూనెను వేడి నీటిలో వేసుకుని స్నానం చేయాలి. తద్వారా ఎలాంటి చెడు వ్యసనాలైన ఈ నూనుతో వదిలి వెళ్తాయి.

శరీరాన్ని చలి కాలంలో వేడిగా ఉంచుతుంది:

లవంగం నూనె వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరుతాయి. చలి కాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.  

స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది:

ఈ నూనెలో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను పెంచడానికి ఉపయోగపడుతుంది.

లవంగం నూనెను ఎలా ఉపయోగించాలి:

1. లవంగం నూనెను గదిలో స్ప్రే కూడా చేయవచ్చు. దీని సువాసన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

2. లవంగం నూనెను అరోమాథెరపీలో కూడా ఉపయోగించవచ్చు. ఇది మానసిక ఆరోగ్యంతో పాటు అనేక ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది.

3. దంతాల సమస్యను తొలగించడానికి లవంగం నూనెను కూడా ఉపయోగించవచ్చు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Weight Loss Mistakes: రోజూ ఇలా వ్యాయమం చేసిన బరువు తగ్గడం లేదా..అయితే ఈ పని చేయండి..!!

Also Read: Weight Loss Diet: బరువు తగ్గలనుకుంటున్నారా..పొటాషియం పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News