Hardik Kohli: లైవ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీపై అరిచిన హార్దిక్ పాండ్యా.. అంతా గ్లెన్ మ్యాక్స్‌వెలే చేశాడు!
RCB vs GT, IPL 2022: Hardik Pandya fires on Virat Kohli. అప్పటికే కాస్త నిరాశలో ఉన్న హార్దిక్ పాండ్యా.. విరాట్ కోహ్లీ ఆలా చేయడంతో ఆగ్రహంతో బంతిని విసిరాడు. కోహ్లీపై అలా తన కోపాన్ని ప్రదర్శించాడు.
Hardik Pandya angry on Virat Kohli over Glenn Maxwell stop GT skipper in his run-up: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపాన్ని లైవ్ మ్యాచ్‌లో తరచుగా చూస్తుంటారు. విరాట్ తన దూకుడు వైఖరితో ప్రపంచ వ్యాప్తంగా అగ్రెసిన్ ప్లేయర్ అని పేరు తెచ్చుకున్నాడు. కోహ్లీ కోపానికి ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు సైతం భయపడుతారు. విరాట్‌పై ఓ ఆటగాడు తన కోపాన్ని ప్రదర్శించడం చాలా అరుదు. అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. విరాట్‌పై మండిపడ్డాడు. ఈ ఘటన ఐపీఎల్ 2022లో జరిగింది.
గురువారం రాత్రి ముంబైలోని వాంఖడే మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (73; 54 బంతుల్లో 8x4, 2x6) హాఫ్ సెంచరీ చేశాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్‌లో కనిపించిన విరాట్.. మునుపటి కోహ్లీని తలపించాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తానికి ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరుస్తున్న కోహ్లీ.. టచ్‌లోకి వచ్చాడు.
లక్ష్య ఛేదనలో భాగంగా 16వ ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఆ ఓవర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీ షాట్లు ఆడాడు. రెండో బంతికి సిక్స్ బాదిన మ్యాక్సీ.. మూడో బంతికి ఫోర్ బాదాడు. ఇక ఇదో బంతికి మరో సిక్స్ బాదడంతో హార్దిక్ అప్పటికే కాస్త నిరాశలో ఉన్నాడు. ఐదో బంతి హార్దిక్ వేస్తుండగా.. సైడ్ స్క్రీన్ కారణంగా మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా లేదు. ఇది గమనించని హార్దిక్ అప్పటికే రనప్ మొదలెట్టి బంతి వేయడానికి వస్తున్నాడు. మాక్స్‌వెల్ స్ట్రైక్‌కి సిద్ధంగా లేకపోవడంతో నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో నిలబడిన విరాట్ కోహ్లీ.. పాండ్యాను ఆపే ప్రయత్నం చేశాడు.
అప్పటికే కాస్త నిరాశలో ఉన్న హార్దిక్ పాండ్యా.. విరాట్ కోహ్లీ ఆలా చేయడంతో ఆగ్రహంతో బంతిని విసిరాడు. కోహ్లీపై అలా తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాట్ కోహ్లీ ఫాన్స్ పాండ్యాపై మండిపడుతున్నారు. కోహ్లీపైనే అరుస్తావా అని ఒకరు ట్వీట్ చేయగా.. అంతా గ్లెన్ మ్యాక్స్‌వెలే చేశాడు ఇంకొకరు ట్వీటారు. అంతకుముందు థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన మాథ్యూ వేడ్ తన కోపాన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాక హెల్మెట్, బ్యాట్‌పై చూపించాడు.
Also Read: iPhone 13 Offer: ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook