Kevin Pietersen says Virat Kohli is currently in dark place: ఐపీఎల్ 2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. విరాట్ ఈ సీజన్లో రెండుసార్లు గోల్డెన్ డకౌట్ అవ్వడం విశేషం. ఇక ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 17 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో కోహ్లీ ప్రస్తుత ప్రదర్శనపై ప్రతిఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీలు సలహాలు ఇస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ స్పందించాడు. 'ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఏ స్థితిలో ఉన్నాడో.. గతంలో నేను కూడా రెండు సార్లు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నా. ఇది ఏ ఆటగాడికైనా మంచిది కాదు. విరాట్ చీకటి ప్రదేశంలో ఉన్నాడు. అందరి దృష్టి కోహ్లీనే ఉన్నప్పుడు.. అది పూర్తిగా ఒంటరి ప్రదేశం. ఇది త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆట కోసం విరాట్ పరుగులు సాధించాల్సి ఉంది. త్వరలోనే పరుగులు చేస్తాడని ఆశిస్తున్నా' అని కేపీ మద్దతుగా నిలిచాడు. 


భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా విరాట్ కోహ్లీ ఫామ్‌పై తన అభిప్రాయం తెలిపాడు. 'విరాట్ కోహ్లీని ఇలాంటి ఫామ్‌లో చూడటం చాలా బాధగా ఉంది. అతడు ఎలాంటి ఆటగాడో మనకు తెలుసు. ఫామ్ అందుకోవడం కోసం ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ శ్రమించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. 1-2 నెలలు క్రికెట్ నుంచి కోహ్లీ రెస్ట్ తీసుకోవాలి. ప్రస్తుతం నెట్స్‌లో ఎక్కువ చెమటోడ్చడం కంటే.. విరామం తీసుకోవడమే ఉత్తమం. కోహ్లీ 5వ స్థానంలో ఆడి ఫామ్ వచ్చాక.. తిరిగి 3వ స్థానంలోకి వెళితే బాగుంటుందని నా సలహా' అని జాఫర్ పేర్కొన్నాడు. 


సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ మార్కో జాన్సన్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ బిత్తరపోయాడు. ఏం జరిగిందో తెలియక కాసేపు క్రీజులోనే అలా ఉండిపోయాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో దుష్మంత చమీర వేసిన అద్భుత బంతికి పరుగులేమీ చేయకుండా ఔటైన విషయం తెలిసిందే. బెంగళూరు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ భారం లేదు కాబట్టి.. కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని ఐపీఎల్ 2022కు ముందు అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పటికైనా కోహ్లీ రన్స్ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 


Also Read: నా సతీమణి నీకు పెద్ద ఫ్యాన్.. నిన్ను ప్రేమిస్తుంది! పూజా హెగ్డేపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్


Also Read: Ola Electric: ఓలా కీలక నిర్ణయం.. 1441 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వెనక్కి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.