నా సతీమణి నీకు పెద్ద ఫ్యాన్.. నిన్ను ప్రేమిస్తుంది! పూజా హెగ్డేపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

Acharya Pre Release Event. Chiranjeevi about Pooja Hegde. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ హీరోయిన్ పూజ హెగ్డేపై ఫన్నీ కామెంట్స్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 06:37 PM IST
  • నా సతీమణి నీకు పెద్ద ఫాన్స్
  • రామ్‌ చరణ్‌తో చేశావ్ కానీ..
  • పూజా హెగ్డేపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
 నా సతీమణి నీకు పెద్ద ఫ్యాన్.. నిన్ను ప్రేమిస్తుంది! పూజా హెగ్డేపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

Acharya Pre Release Event, Chiranjeevi says My wife Surekha likes Pooja Hegde smile: టాలీవుడ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాలలో 'ఆచార్య' ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ కీల‌క‌ పాత్ర‌లో న‌టించాడు. స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఆచార్య సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించారు. పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుద‌లకు సిదంగా ఉంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్ర‌మోష‌న్ కార్యకమాల్లో వేగం పెంచింది. 

ఆచార్య సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ పూజ హెగ్డేపై ఫన్నీ కామెంట్స్ చేశారు. 'రామ్‌ చ‌ర‌ణ్ కంటే ముందు పూజా హెగ్డే గురించి మాట్లాడాలి. పూజ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుందని ఎప్పుడూ నాతో చెపుతుంది. ఇక రామ్‌ చరణ్‌తో జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది' అని అన్నారు. 

పూజా హెగ్డే మాట్లాడుతూ... 'కొరటాల శివ గారు పవర్ ప్యాక్డ్ డైరెక్టర్. నీలాంబరి పాత్ర నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. చిరంజీవి గారి దగ్గర స్వాగ్, స్టైల్ చాలా ఉంది. నాక్కూడా కొంచెం స్వాగ్ ఇవ్వండి. ప్రతీ సినిమాతో రామ్ చరణ్ బెటర్ అవుతున్నారు. ఆయన చాలా కామ్‌గా ఉంటాడు. కెమెరా ముందుకు వచ్చినపుడే.. ఆ ఎనర్జీని బయటకు తీస్తాడు. మళ్లీ ఆయనతో పని చేయాలనుంది. ఆచార్య నెరేషన్ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి.. సినిమా చూశాక అందరికీ కూడా అలానే అనిపిస్తుంది. అభిమానులందరికి ఐ లవ్యూ' అని చెప్పారు.

ఆచార్య సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో దర్శకులు మోహన్‌ రాజా, మెహర్‌ రమేష్‌, బాబీ.. నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి,, ఎన్వీ ప్రసాద్‌, డివివి దానయ్య, కె.ఎస్‌.రామారావు, వై రవిశంకర్‌.. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌.. చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన తదితరులు పాల్గొన్నారు.

Also Read: Michael Vaughan: ముంబై ప్లేఆఫ్‌కు చేరకపోతే...రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడం మంచిది

Also Read: Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్, భర్త రాణాలపై మరో ఎఫ్ఐఆర్, బాంద్రా కోర్టులో హాజరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x