Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..
BCCI Fires On Selection Commitee: కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయని ముందే హింట్ ఇచ్చిన బీసీసీఐ.. అందుకు తగినట్లు ప్రక్షాళన మొదలుపెట్టింది. సెలెక్షన్ కమిటీకి ఉద్వాసన పలికింది.
BCCI Fires on Selection Commitee: చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తొలగించి బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28లోగా సెలక్టర్ పదవికి కొత్త దరఖాస్తులను కోరింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటి ముఖంపట్టడంతో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా సెలెక్షన్ కమిటీ నుంచే పని మొదలు పెట్టింది. సెలెక్టర్లు చేతన్ శర్మ, హర్విందర్ సింగ్, సునీల్ జోషి, దేబశిష్ మొహంతిలకు ఉద్వాసన పలికింది. గతేడాది కాలంగా సెలెక్టర్లు చేసిన ప్రయోగాలన్నీ ప్రపంచ కప్‌లో బెడిసికొట్టడం ఉద్వాసనకు కారణమైంది.
వరుసగా 2 ప్రపంచకప్‌లలో ఓటమి..
గత రెండు టీ20 ప్రపంచ కప్‌లలో టీమిండియా ప్రదర్శన అంత గొప్పగా లేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు చేరినా.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.
కేఎల్ రాహుల్ ఫ్లాప్ షో..
టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిందిపోయి.. త్వరగా ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకుని ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. పెద్ద టీమ్‌లతో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. వరల్డ్ కప్‌లో 6 మ్యాచ్‌ల్లో 128 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై అర్ధసెంచరీలు చేశాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతను జట్టులో కొనసాగాడు.
చాలా మంది కెప్టెన్లను ప్రయత్నించారు
2021 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. కాని సెలెక్టర్లు అతనికి ముఖ్యమైన పర్యటనలలో విశ్రాంతినిచ్చి.. అతని స్థానంలో మరొక కెప్టెన్‌ను నియమించారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రిషబ్ పంత్, నెదర్లాండ్స్ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా, జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్‌లు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో కూడా జస్ప్రీత్ బుమ్రాకు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. మధ్యలో శిఖర్ ధావన్ కూడా కొన్ని సిరీస్‌లకు కెప్టెన్‌గా పనిచేశాడు. ఇలా గతేడాది కాలంలో సెలక్టర్లు 8 మంది కెప్టెన్లను ప్రయత్నించారు.
ఒక్కో టోర్నీకి వేర్వేరు టీమ్‌లను పంపారు
గత ఏడాది కాలంలో భారత్ చాలా దేశాలలో పర్యటించింది. జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటనలకు పూర్తిగా భిన్నమైన జట్లను పంపారు. అదే సమయంలో అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్‌లు ఆసియా కప్‌లో చోటు కల్పించారు. కానీ వారిని టీ20 ప్రపంచ కప్ 2022 నుంచి తొలగించారు. ఆసియా కప్ 2022లో సూపర్-4 మ్యాచ్‌లలో పాకిస్థాన్, శ్రీలంకపై జట్ల చేతిలో ఓడిపోయి టీమిండియా ఫైనల్స్‌కు కూడా చేరుకోలేకపోయింది.
గాయపడిన ఆటగాళ్లను జట్టులో ఎందుకు ఎంపిక చేశారు..?
దక్షిణాఫ్రికా సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. కానీ అతను పూర్తిగా ఫిట్‌గా లేడు. అయినప్పటికీ అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతను గాయం కారణంగా మొత్తం టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. టీ20 ప్రపంచకప్‌లో ఉన్న హర్షల్ పటేల్‌కు ఒక్క అవకాశం కూడా దక్కలేదు. హర్షల్ పటేల్ పూర్తిగా ఫిట్‌గా లేడా..? రిజర్వ్ ప్లేయర్లలో ఎంపికైన దీపక్ చాహర్ కూడా గాయపడ్డాడు. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ టీమ్ ఇండియాతో కలిసి ప్రతి టూర్‌కు వెళ్లాడు. కానీ అక్కడ నుంచి టాలెంట్ హంట్‌గా వెతికి కొత్త ఆటగాడిని తీసుకురాలేకపోయాడు. విశ్రాంతి పేరుతో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి.. జూనియర్లపై ప్రయోగాలు చేశారు సెలెక్టర్లు. అన్ని ప్రయోగాలు బెడిసి కొట్టి.. చివరకు వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో అవమానకర రీతిలో ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది.
Also Read: Dharmapuri Aravind: బంజారాహిల్స్ పిఎస్‌లో కవితపై ధర్మపురి అరవింద్ ఫిర్యాదు
Also Read: BCCI: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook