BCCI: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. బీసీసీఐ సంచలన నిర్ణయం! సీనియర్ సెలక్షన్ కమిటీ ఔట్

BCCI Sacked Senior Selection Committee Including Chetan Sharma. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఓటమి నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మతో సహా సీనియర్ సెలక్షన్ కమిటీని తొలగించింది.    

Written by - P Sampath Kumar | Last Updated : Nov 18, 2022, 09:58 PM IST
  • టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్
  • బీసీసీఐ సంచలన నిర్ణయం
  • సీనియర్ సెలక్షన్ కమిటీ ఔట్
BCCI: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. బీసీసీఐ సంచలన నిర్ణయం! సీనియర్ సెలక్షన్ కమిటీ ఔట్

BCCI fire Senior Selection Committee Including Chetan Sharma after T20 World Cup 2022 debacle: ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్‌తో 169 పరుగులను కూడా కాపాడుకోలేక ఇంగ్లండ్ ముందు తలొంచింది. టైటిల్ ఫెవరేట్ అయిన భారత్.. కీలక సెమీస్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ వైఫల్యం కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణం అయింది. మెగా టోర్నీలో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టడంతో టీమిండియాపై విమర్శల వర్షం కురిసింది. దాంతో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. 

టీ20 ప్రపంచకప్ 2022 నుంచి భారత్ నిష్క్రమించిన తర్వాత టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. చేతన్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీని బీసీసీఐ శుక్రవారం తొలగించింది. చేతన్ (నార్త్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్) మరియు దేబాసిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సీనియర్ జాతీయ సెలెక్టర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో కొందరిని 2020లో, మరికొందరిని 2021లో బీసీసీఐ నియమించింది.

సీనియర్ జాతీయ సెలెక్టర్ గరిష్టంగా నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పొందుతారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో మొత్తం 5 సెలెక్టర్ల పోస్ట్ కోసం ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం బీసీసీఐ దరఖాస్తులను కూడా పిలిచింది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 7 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డే మరియు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఇక దరఖాస్తు దారులందరూ కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయి ఉండాలి. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 28గా బీసీసీఐ పేర్కొంది.

Also Read: King Kobras Fight Viral Video: ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం.. ఐదు గంటల పాటు కొట్టుకున్న రెండు మేల్ కింగ్ కోబ్రాలు!   

Also Read: Kriti Kharbanda Pics: కృతి కర్బందా హాట్ ట్రీట్.. సిల్క్ చీరలో అన్ని చూపించేస్తుందిగా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News