Rilee Rossouw Century helped South Africa post 205 target to Bangladesh: టీ20 ప్రపంచకప్ 2022లో దక్షిణాఫ్రికా జట్టు దుమ్మురేపింది. వాతావరణం ఫోబియా నుంచి బయటపడడానికి దక్షిణాఫ్రికా ప్లేయర్స్ ముందే స్కెచ్ వేసుకుని మరీ బరిలోకి దిగారు. హిట్టింగ్ చేయడమే లక్ష్యంగా మైదానంలోకి వచ్చారు ప్రొటీస్ బ్యాటర్లు. అనుకున్న మాదిరిగానే పరుగుల సునామీ సృష్టించి బంగ్లాదేశ్‌ ముందు భారీ టార్గెట్ ఉంచారు. వర్షం పడే అవకాశం ఉండటం వల్ల వీలైనంత వేగంగా రన్స్ బాదారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 7 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ టెంబా బావుమా రెండు పరుగులకే ఔట్ అయ్యాడు. వర్షం ముప్పు ఉండడంతో.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ రిలీ రొస్సొ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బంగ్లా బౌలర్లను ఆటాడుకంటూ బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా రొస్సొ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు బాదారు. 


రిలీ రొస్సొ భారీ షాట్లతో విరుచుకుపడి 52 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి చేసుకున్న షకీబుల్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆపై క్వింటన్ డికాక్ కూడా అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 63 పరుగులు చేసిన డికాక్.. మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లు బాదాడు. ట్రిస్టన్ స్టబ్స్, ఎయిడెన్ మార్క్‌రమ్ త్వరగానే అవుట్ అయ్యారు. భారీ స్కోర్ చేస్తుందనుకున్నా. చివరకు 205 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్ ముగిసింది. బంగ్లా బౌలర్లల్లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.



సిడ్నీలో జరుగుతున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు తేలికపాటి జల్లులు పడ్డాయి. మ్యాచ్ ఆరంభ సమయానికి వర్షం తగ్గింది. దాంతో మ్యాచ్ యధాతథంగా ఆరంభమైంది. అయితే వర్షం ఎప్పుడు పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉండడంతో.. ప్రొటీస్ బ్యాటర్లు ముందుగానే ప్లాన్ చేసుకుని బరిలోకి దిగారు. హిట్టింగ్ లక్ష్యంగా ఆడి సక్సెస్ అయ్యారు. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌ 2022లో తొలి సెంచరీ నమోదైంది. ఆరేళ్ళ తర్వాత జట్టులోకి వచ్చిన రిలీ రొస్సొ.. ఏకంగా సెంచరీతో సత్తా చాటాడు. అతడికి ఇది రెండో టీ20 సెంచరీ. 



 


Also Read: IND vs NED Live Updates: మరికొద్దిసేపట్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ.. టాస్ అప్ డేట్స్ ఇవే!  


Also Read: Chiranjeevi Godfather Collections : గాడ్ ఫాదర్ రిపోర్ట్ ఇదే.. అన్ని కోట్ల నష్టమా?.. రికవరీ ఇక కష్టమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి